తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. పెద్దలను కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నడ్డి రోడ్డుపై అందరు చూస్తుండగానే దారుణంగా హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంబజార్ కోల్సివాడికి చెందిన నీరజ్ పన్వార్ (21) శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో అతని భార్య సోదరులు, స్నేహితులు నీరజ్ పన్వార్‌ను కిరాతకంగా హతమార్చి, కర్ణాటకలోని గుడిమిత్కల్ ప్రాంతానికి వారు పారిపోయారు. హంతకులు.. మృతుడు నీరజ్ భార్య సంజన కజిన్ బ్రదర్స్, వారి ముగ్గురు స్నేహితులుగా గుర్తించాం. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరిపి, కర్ణాటక గుడిమత్కల్లో నిందితులను గుర్తించాం. ఇప్పటికే మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం” అని తెలిపారు.
మృతుడి భార్య సంజన మాట్లాడుతూ..” నిందితులను ఉరి తీయాలి. నా అన్నదమ్ములే ఈ హత్య చేశారు. ఏడాదిగా నన్ను నా అన్నదమ్ములు పదే పదే బెదిరించారు. పీఎస్‌లో ఫిర్యాదు చేసినా నా సోదరులు వెనక్కి తగ్గలేదు అంటూ నా భర్తను చంపేశారు” అని కన్నీరు మున్నీరు అయ్యింది. తన అన్నదమ్ములను కఠినంగా శిక్షించే వరకు పోరాటం చేస్తానని ఆమె ధర్నాకు దిగింది.
అనంతరం సంజన తల్లి మధుబాయి మీడియాతో మాట్లాడుతూ.. “నా కూతురు సంసారాన్ని నాశనం చేశారు. హత్య చేసిన వాళ్లని ఉరి తీయాలి. నీరజ్ హత్యలో మా కుటుంబ ప్రమేయం లేదు. గత ఆరు నెలలుగా నా కూతురిని, అల్లుడిని చంపుతామని కొందరు బెదిరించారు. వాళ్లు ఎవరనేది తెలియదు. హత్య జరిగిన సమయంలో నా కుమారుడు రితేష్, బావ కుమారులు నలుగురూ ఇంట్లోనే ఉన్నారు. హత్యతో వాళ్లకి ఎలాంటి సంబంధం లేదు. హత్య జరిగిన విషయం తెలుసుకొని భయపడి ఇంట్లో నుంచి పారిపోయారు” అని ఆమె అన్నారు.