ప్రభుత్వం ఇబ్బంది పెడితే నా కుమార్తె రాజకీయాల్లోకి వస్తుంది - MicTv.in - Telugu News
mictv telugu

 ప్రభుత్వం ఇబ్బంది పెడితే నా కుమార్తె రాజకీయాల్లోకి వస్తుంది

May 31, 2020

 

Jagga Reddy

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డిని మార్చాల్సిన అవసరం లేదని, దీనిపై ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీకు లేఖ రాస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. పీసీసీ చీఫ్ రేసులో తానున్నానని తెలిపారు. ఉత్తమ్‌ నాయకత్వంలోనే వచ్చే ఎన్నికలకు వెళ్లాలని చెప్పారు. పీసీసీ కోసం ఎంపీ రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, నన్నడిగితే ఇవ్వొద్దని చెబుతానని తెలిపారు. 

తన అభ్యంతరాలను నేరుగా రేవంత్‌రెడ్డికే చెబుతానని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డికి పీసీసీ ఇస్తే తన రాజకీయం తనకుందని జగ్గారెడ్డి స్పష్టంచేశారు. ‘ఉత్తమ్‌పై రేవంత్‌రెడ్డి ఫేస్‌బుక్‌ టైగర్లు దుష్ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ప్రభుత్వ కోవర్టులు ఉన్నారు. కుంతియా దగ్గరున్న ఇద్దరు నేతలు కోవర్టు పనులు చేస్తున్నారు. ప్రభుత్వం నన్ను రాజకీయంగా ఇబ్బంది పెడితే.. నా కూతురు రాజకీయాల్లోకి వస్తుంది’ అని జగ్గారెడ్డి తెలిపారు.