నన్ను నా కుటుంబం వెలివేసింది : సినీ నటి - MicTv.in - Telugu News
mictv telugu

నన్ను నా కుటుంబం వెలివేసింది : సినీ నటి

April 15, 2022

 

ppppp

సినీనటి, మోడల్ పూనం పాండే తన వ్యక్తిగత జీవితం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న లాక్ అప్ అనే రియాలిటీ షోలో పూనం ఈ వ్యాఖ్యలు చేసింది. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఏడ్చేసింది. ‘మూడు నాలుగేళ్ల క్రితం వరకు నేను నా కుటుంబంతో కలిసి ఉన్నాను. ఒకరోజు సడెన్‌గా ఏ కారణం లేకుండానే నా కుటుంబం నన్ను వెలివేసింది. నేను ఆశ్చర్యపోయా. నేనెవ్వరి గురించి చెడుగా మాట్లాడలేదు. నా పని చేసుకోవడంతో బిజీగా ఉన్నా. అందరూ నా గురించి చెడుగా అనుకుంటున్నారు. నా గురించి మాట్లాడేముందు నన్ను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి’ అని రిక్వెస్ట్ చేసింది. ఇదిలా ఉండగా, ఇంట్లోంచి గెంటేసిన అనంతరం పూనం శ్యాం బాంబే అనే వ్యక్తితో రెండేళ్లు సహజీవనం చేసింది. గతేడాది వివాహం చేసుకోగా, తనను బాగా కొడుతున్నాడంటూ భర్తపై గృహ హింస కేసు పెట్టింది. తర్వాత మాజీ భర్త రాజీకి రావడంతో గొడవ సమసిపోయింది.