My grandfather gave me ten lakhs: Allu Arjun
mictv telugu

నేనెందుకూ పనికిరానని పది లక్షలిచ్చారు : అల్లు అర్జున్

October 2, 2022

ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా శనివారం రాత్రి హైద్రాబాదులో ‘అల్లు రామలింగయ్య’పుస్తకావిష్కరణ జరిగింది. చిరంజీవి, వెంకయ్యనాయుడు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘నాకు 16 ఏళ్లు వచ్చేవరకు తాతయ్య, నానమ్మలతోనే ఉన్నా. తాత చనిపోయాక పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి. 8 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉండగా, నాకే ఎందుకు వచ్చిందని అనుకున్నా. తాత ఎందుకిలా చేశారు? అని పాలసీ కట్టిన సంవత్సరం చూస్తే.. ఆ సమయంలో నేను నాలుగో తరగతి చదువుతున్నా. వీడు జీవితంలో ఎందుకూ పనికిరాడు. మేజర్ అయ్యాక ఈ డబ్బులు పనికొస్తాయని భావించి నా కోసం జమ చేశారు. ఆయన దృష్టిలో ఎందుకూ పనికిరాని నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను. నా ఎదుగుదల ఆయన చూసి ఉంటే బాగుండేద’ని భావోద్వేగానికి గురయ్యారు.