My home jupalli Rameshwara Rao meets bjp national president jp nadda
mictv telugu

నడ్డాతో మైహోమ్ రామేశ్వరరావు భేటీ.. ఏం జరుగుతోంది!

August 27, 2022

My home jupalli Rameshwara Rao meets bjp national president jp nadda

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. పలు రంగాల ప్రముఖులను వరసబెట్టి కలవడం వెనక పెద్ద స్కెచ్చే ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మాజీ క్రికెట‌ర్ మిథాలీ రాజ్‌ను కలిసిన ఆయన శనివారం రాత్రి సినీ హీరో నితిన్‌తో ముచ్చట్లు పెట్టుకోనున్నారు. తర్వాత మరో ప్రముఖ వ్యక్తిని కూడా కలవబోతున్నారు. టీవీ9, మైహోమ్ రియల్ ఎస్టేట్ సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావును కూడా శనివారం రాత్రి శంషాబాద్ హోటల్లో కలవనున్నారు.

మొన్నటివరకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు నెరిపిన జూపల్లి ఇటీవల ఆయనకు దూరంగా ఉన్నట్టు వార్తలు రావడం తెలిసిందే.
చిన్నజీయర్ స్వామి ఏర్పాటు చేసిన ‘సమతా విగ్రహా’విష్కరణ సందర్భంగా స్వామికి, కేసీఆర్‌కు పొరపొచ్చాలు వచ్చాయి. స్వామికి ప్రియ శిష్యుడైన జూపల్లి కూడా ఆయన బాటలోనే టీఆర్ఎస్‌కు దూరంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. జూపల్లి త్వరలో బీజేపీ కండువా కప్పుకుంటారని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో నడ్డాతో భేటీ కావడడం గమనార్హం. రాష్ట్రంలో కాషాయ దళానికి అడ్డుకట్ట వేయాలని గులాబీ తీవ్రంగా ప్రయత్నిస్తుండడం, ఇరు పక్షాల మధ్య భీకర విమర్శలు సాగుతుండడం తెలిసిందే.