my husband forced me for physical relation before marriage actor naresh wife ramya raghupathi allegations
mictv telugu

పెళ్ళికి ముందే శృంగారం చేద్దామని..!

January 8, 2023

my husband forced me for physical relation before marriage actor naresh wife ramya raghupathi allegations

విజయనిర్మల ఎప్పుడైతే చనిపోయారో అప్పటినుండి నటుడు నరేష్ జీవితం రోడ్డున పడిపోయింది. అప్పటివరకు నాలుగు గోడల మధ్య ఉన్న కుటుంబ కలహాలు.. ఆమె మరణం తరువాత తీవ్రతరం అయ్యాయి. నరేష్ కి తన మూడవ భార్య రమ్య రఘుపతితో మొదటి నుండి మనస్పర్థాలు ఉండేవట. సినిమా ఆర్టిస్టులతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని.. మీడియా ముందుకు వెళ్తానని రమ్య రఘుపతి చాలాసార్లు హెచ్చరించినా.. విజయనిర్మల సర్దిచెప్పేదట. అయితే అమ్మ మరణం తరువాత బహిరంగంగా తన సహానటితో రిలేషన్ బయటపడటంతో నరేష్ కాపురంలో ఒక్కసారిగా చిచ్చు మొదలైంది. కర్ణాటక హోటల్ లో నటి పవిత్ర లోకేష్, నరేష్ జంటని రమ్య రఘుపతి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటంతో రచ్చ తారాస్థాయికి చేరింది. అప్పటి నుండి నరేష్ – పవిత్ర లోకేష్, రమ్య రఘుపతిల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. అయితే ఈ సందర్భంగా నరేష్ గురించి రోజుకొక కొత్త వార్తని చెప్తూ వస్తుంది రమ్య రఘుపతి. నరేష్ తనని మానసికంగా హింస పెట్టేవాడిని.. విడాకుల కోసం తండ్రి లాంటి కృష్ణ గారితో అక్రమ సంబంధం అంటగట్టేవాడని నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిన రమ్య రఘుపతి.. నేడు మరో బాంబు పేల్చింది.

నరేష్ తన కంటే 20ఏళ్ళు పెద్దవాడైనా..13ఏళ్ళ ఏజ్ గ్యాప్ అని అబద్దం చెప్పి పెళ్లి చేసుకున్నాడని.. పెద్దలు ఒప్పుకోకపోతే లేచిపోయి పెళ్లి చేసుకుందామని అనేవాడని చెప్పింది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘పెళ్ళికి ముందే శృంగారం చేద్దామని అడిగాడు. కొంత కాలం పెళ్లి వద్దు సహజీవనం చేద్దామని ఒప్పించే ప్రయత్నం చేశాడు. ఎన్ని చెప్పినా నేను లొంగలేదు. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోలేకపోతే చాలా మిస్ అవుతానని చెప్పాడు. ఆ మాటలు నా మనసు మార్చాయి. వివాహం చేసుకునేందుకు ఒప్పుకునేలా చేశాయి. తర్వాత మాకు అబ్బాయి పుట్టాడు. పవిత్ర లోకేష్ పరిచయం అయ్యాక నన్ను టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. నన్ను వదిలించుకోవడానికి కుట్రలు చేశాడు’ అని రమ్య రఘుపతి కీలక ఆరోపణలు చేశారు. ఇక తన కొడుకు ఇంకా తండ్రి కావాలని అంటున్నాడని.. తన కొడుకు కోసమైనా నేను పవిత్ర-నరేష్ ల వివాహం జరగనీయనని రమ్య రఘుపతి శబధం చేస్తున్నారు. తానూ చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండా నరేష్ మరో వివాహం చేసుకోవడం కుదరదు అన్నారు రమ్య రఘుపతి.