My husband is a man not 'she'..complaint for 8 years
mictv telugu

భార్యతో అసహజ శృంగారం..8 ఏళ్లకి అసలు విషయం తెలిసి..

September 17, 2022

వివాహ సంబంధాల వెబ్‌సైటు ద్వారా పరిచయమైన ఓ జంట పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని, ఆనందంగా 8 ఏళ్లపాటు వైవాహిక జీవితాన్ని గడిపిన తర్వాత, తన భర్త మగాడు కాదంటూ, భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన గుజరాత్‌లో కలకలం రేపింది. తన భర్త పెళ్లైన రోజు నుంచి 8ఏళ్లపాటు తన పట్ల వ్యవహరించిన తీరును వర్ణిస్తూ, ఫిర్యాదులో పలు సంచలన విషయాలను వెల్లడించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..”ఈ ఘటన గుజరాత్ రాష్ట్రం వడోదరలో జరిగింది. ఫిర్యాదురాలికి 2014 ఫిబ్రవరిలో మ్యాట్రిమోనిలో పరిచయమైన ఓ వ్యక్తితో వివాహమైంది. 8 ఏళ్లపాటు వారి వైవాహిక జీవితం సాగింది. ఆ తర్వాత ఆమె పట్ల భర్త వ్యవహరిస్తున్న తీరుపై అనుమానం రావడంతో అసలు విషయం బయటపడింది. ఆమె భర్త పురుషుడే కాదని, రహస్య అవయవాలకు శస్త్రచికిత్స చేయించుకున్న విషయం కూడా ఆమెకు తెలియకుండా దాచినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో మేము అసహజ శృంగారం, మోసం అభియోగాల కింద ఆమె భర్తపై కేసు నమోదు చేశాం. అతడిని అదుపులోకి తీసుకొని, విచారణ చేస్తున్నాం. అంతేకాదు, అసలు విషయం దాచి పెళ్లి చేసినందుకు అత్తింటివారి పేర్లు కూడా ఆమె ఫిర్యాదులో చేర్చారు. వారిని కూడా విచారిస్తున్నాం” అని వివరాలను వెల్లడించారు.

మహిళ ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి..”వివాహ సంబంధాల వెబ్‌సైటు ద్వారా మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. దాంతో 2014 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నాం. హనీమూన్ కోసం కశ్మీర్‌కు కూడా వెళ్లాం. చాలా రోజులపాటు నా భర్త నాకు దూరంగా ఉంటూ, చాలా సాకులు చెప్పేవాడు. దీంతో ఒకరోజు నేను అతడిని నిలదీశాను. దానికి అతడు.. రష్యాలో జరిగిన ఓ ప్రమాదం కారణంగా తాను శృంగార సామర్థ్యం కోల్పోయినట్లు సమాధానం చెప్పాడు. ఆ తర్వాత 2020లో పొట్ట తగ్గేందుకు సర్జరీ అని కోల్‌కతాకు వెళ్లాడు. అక్కడ పురుష అవయవాల కోసం శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కానీ, అవేమి నాకు చెప్పలేదు. ఆ తర్వాత నాతో అసహజ శృంగారం ప్రారంభించిన అతడు.. ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు.”