నా బిడ్డనూ సైనికుణ్ని చేస్తా.. సర్జికల్ అమరుడు సందీప్ సింగ్ భార్య ప్రతిన - MicTv.in - Telugu News
mictv telugu

నా బిడ్డనూ సైనికుణ్ని చేస్తా.. సర్జికల్ అమరుడు సందీప్ సింగ్ భార్య ప్రతిన

September 27, 2018

దేశం కోసం తన భర్త ప్రాణత్యాగం చేసినందుకు గర్వపడుతున్నానని, తన బిడ్డకు కూడా దేశభక్తి అంటే ఏంటో తెలియజేసి, ఆర్మీలో చేర్చుతానని సర్జికల్ దాడుల వీరుడు సందీప్ సింగ్ భార్య చెప్పారు. మంగళవారం జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సందీప్ సింగ్ వీరమరణ పొందడం తెలిసిందే.

ff

అతని అంత్యక్రియలు బుధవారం స్వస్థలమైన పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో జరిగాయి. భర్త మృతదేహాన్ని చూసిన గుర్‌ప్రీత్ గుండెలవిసేలా ఏడ్చింది. కానీ ధైర్యం  కోల్పోలేదు. తండ్రి ఇక లేడని, ఎప్పటికీ రాలేడని తెలియని సందీప్ కొడుకు తండ్రి భౌతికకాయం దగ్గర నిలబడి సెల్యూట్ చేశాడు. ఈ దృశ్యాన్ని చూసి ప్రతి ఒక్కరు కన్నీమున్నీరయ్యారు. తన భర్త దేశం కోసం భర్త ప్రాణాలు అర్పించిందుకు గర్వ పడుతున్నానని గుర్‌ప్రీత్ అన్నారు. తన కొడుకుని ఉన్నత చదువులు చదివించి భారత సైన్యంలో చేరుస్తానని ఆమె పేర్కొన్నారు.

జమ్మూలోని కుప్వారా జిల్లా తంగ్ ధర్ సెక్టార్ లో ముష్కరుల చొరబాడుతున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు ఆదివారం ఎదురుదాడికి దిగాయి. వారికి, ఉగ్రవాదులకు  మధ్య హోరాహోరీ ఎదురుకాల్పులు జరిగాయి. చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదుల్లో ఆరుగురుని భారత జవాన్లు మట్టుబెట్టారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో లాన్స్ నాయక్ సందీప్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. సందీప్ సింగ్ 2016లో పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలోని ఉగ్రవాద స్థావరాలపై భారతసైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌లో పాల్గొన్నాడు. ఒక పటాలానికి సారథ్యం వహించి ఉగ్ర ముష్కరులను హతమార్చడంలో కీలక పాత్ర పోషించాడు.