నా భర్త లక్ష్యమే - నా అంతిమ లక్ష్యం: ఉక్రెయిన్ ప్రథమ మహిళ గుండె ధైర్యం - MicTv.in - Telugu News
mictv telugu

నా భర్త లక్ష్యమే – నా అంతిమ లక్ష్యం: ఉక్రెయిన్ ప్రథమ మహిళ గుండె ధైర్యం

March 2, 2022

bbb

సరిగ్గా గతవారం (బుధవారం) ఇదే రోజున రష్యా దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌ దేశంపై యుద్ధం ప్రకటించాడు. ప్రపంచ దేశాలు వద్దు వద్దు అంటూ పలుమార్లు పుతిన్‌కు సూచించిన.. తమ యుద్ధానికి అడ్డుపడితే, ఊరుకునేది లేదు అంటూ పుతిన్ భీకరంగా వార్నింగ్ ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా బలగాలు పలు నగరాలను ధ్వంసం చేసి స్వాధీనం చేసుకున్నాయి. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలాదిమిర్ జెలెన్ స్కీ మాట్లాడుతూ.. “నేను, నా కుటుంబం ఎక్కడికి పారిపోలేదు. ఉక్రెయిన్‌లోనే ఉన్నాం, ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో కీవ్ ప్రాంతాన్ని పోగోట్టుకోం. రష్యా బలగాలకు లొంగిపోం. ఆయుధాలను వదలం. యుద్ధాన్ని ఆపాం” అంటూ సాధారణ పౌరులకు సైతం యుద్ధంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించాడు.

దీంతో ఉక్రెయిన్ దేశస్థులు రష్యా బలగాలను ఎదురిస్తున్నారు. తమ దేశంలోకి రావడానికి హక్కు ఎవరు ఇచ్చారు అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది యుద్ధ ట్యాంకులను ఎత్తుకెళ్లితున్నారు. అయిన రష్యా ఉక్రెయిన్‌పై రెచ్చిపోయి దారుణంగా బాంబుల మోత కురిపిస్తున్న నేపథ్యంలో సామాన్యులు, చిన్న పిల్లలు, విదేశీయులు మృతి చెందుతున్నారు.

ఇలాంటి తరుణంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భార్య వొలెనా జెలెస్కొ ఉక్రెయిన్ దేశం పట్ల ఆమెకున్న ప్రేమ, అభిమానం, ధైర్యాన్ని గురించి యావత్ ప్రపంచ దేశాలు కిర్తిస్తున్నాయి. ఇంతకి ఎవరు జెలెస్కొ..?, ఏ చదివింది..? ఏ ఉద్యోగం చేసింది..? అనే విషయాలు మీకోసం…

‘జెలెన్ స్కీ దేశం విడిచిపారిపోయారంటూ గిట్టని వాళ్లు వదంతులు వ్యాప్తి చేసినా, లేదు నా భర్త ఇక్కడే ఉన్నాడు. ఆయన వెంట నేను ఉన్నాను. ఈ ప్రజల వెంట నేనుంటాను’ అంటూ ధైర్యంగా చెప్తున్నారు వొలెనా జెలెస్కొ. తన భర్త నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారతానంటే అయిష్టం వ్యక్తం చేసిన జెలెన్స్క సతీమణి వొలెనా (44). ఇప్పుడు ప్రతి అడుగులో ఆయన వెంటే నడుస్తున్నారు. శత్రువు కఠినంగా వ్యవహరిస్తున్నా, దేశం విడిచి వెళ్లడానికి నిరాకరిస్తున్నారు.

‘నాకు భయం లేదు. కన్నీరు రాదు. నేను ప్రశాంతంగా, ధైర్యంగా ఉంటాను. నా పిల్లలు నా వైపు చూస్తున్నారు. నేను వారి పక్కన ఉండాలి. నా భర్త పక్కన ఉండాలి. ఈ దేశ ప్రజల చెంత ఉండాలి’ అంటూ పెను ప్రమాదంలో దృఢ వైఖరి ప్రదర్శిస్తున్నారు. జెలెన్ స్కీ నటుడిగా, దేశాధ్యక్షుడిగా ఎప్పుడూ తెరపైనే ఉన్నారు. ఆమె మాత్రం తెర వెనకే ఉండి, తన పనితాను చేసుకోవడానికి ఇష్టపడేవారు. అయితే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో మాత్రం తన మాటలతో ప్రపంచం దృష్టిలో పడ్డారు.

ఆర్కిటెక్చర్ చదివిన జెలెనా. తదనంతర కాలంలో రచయితగా తన అభిరుచిని కొనసాగించారు. ఆమె, జెలెన్స్క చిన్నప్పటి నుంచే కలిసి చదువుకున్నప్పటికీ.. కళాశాల స్థాయిలోనే వీరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఏర్పడిన అనుబంధం.. 2003లో వివాహానికి దారితీసింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. నటుడిగా కెరీర్‌ను వదిలి, రాజకీయ నాయకుడిగా ప్రస్థానం మొదలు పెడతానని జెలెన్‌ స్కీ అనగానే వొలెనా తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా సరే, రాజకీయ నేత నుంచి అధ్యక్షుడిగా ఎదిగే క్రమంలో ఆయన వెంటే ఉండి నడిపిస్తున్నారు. ఉక్రెయిన్, అధ్యక్షుడు జెలెన్ స్కీ, భార్య జెలెస్కో, యుద్ధం, రష్యా, అధ్యక్షుడు పుతిన్, ప్రథమ మహిళ