ఎమ్మెల్యే ఆర్కే నా తల్లిని తీసుకెళ్లారు.. దుగ్గిరాల వాసి ఆవేదన - MicTv.in - Telugu News
mictv telugu

ఎమ్మెల్యే ఆర్కే నా తల్లిని తీసుకెళ్లారు.. దుగ్గిరాల వాసి ఆవేదన

May 4, 2022

మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల ఎంపీపీ సీటును కైవసం చేసుకోవడానికి వైసీపీ, టీడీపీలు తమ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. మండలంలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలుండగా, అందులో వైసీపీ 8, టీడీపీ 9, జనసేన 1 చొప్పున గెలిచాయి. సహజంగా అత్యధిక స్థానాలున్న టీడీపీ ఎంపీటీసీనే ఎంపీపీ చేపడుతారు. కానీ, ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఎంపీపీ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది.

టీడీపీ తరపున గెలిచిన తొమ్మిది మంది ఎంపీటీసీల్లో ఒక్కరు కూడా బీసీ మహిళ లేరు. ఓ ముస్లిం అభ్యర్థి ఉన్నా ఆమెకు బీసీ సర్టిఫికెట్ రాకుండా అడ్డుకుంటున్నారు. వైసీపీలో ఇద్దరు బీసీ మహిళా ఎంపీటీసీలు ఉన్నా, వారికి మెజారిటీ లేకపోవడంతో పోరు రసవత్తరంగా మారింది. గతంలో రెండుసార్లు ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయగా, కోరం లేకపోవడంతో సమావేశాలు వాయిదా పడ్డాయి. అయితే అధికార వైసీపీ ఎలాగైనా పదవి దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

వైసీపీ తమకున్న ఇద్దరు బీసీ మహిళల్లో ఒకరిని ఎంపీపీ అభ్యర్ధిగా ప్రకటించింది. దీంతో దుగ్గిరాల 2 ఎంపీటీసీగా ఉన్న మరో మహిళ తాడిబోయిన పద్మావతి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలని ఆశిస్తున్నారు. దీంతో టీడీపీకి మద్ధతిచ్చి ఆ పార్టీకి ఎంపీపీ పదవి కట్టబెడతారనే ఉద్దేశంతో పద్మావతిని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బలవంతంగా ఎత్తుకుపోయారని ఆమె కుమారుడు యుగంధర్ ఆరోపిస్తున్నాడు. ఇలు ఎస్ఐ కూడా తమ కుటుంబాన్ని వేధిస్తున్నాడని చెప్పాడు. తమ కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారని, తమకు ప్రాణహాని ఉందని యుగంధర్ ఆవేదన చెందుతున్నాడు.