మా తండ్రి ఇంకా బతికే ఉన్నారు..ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ తనయుడు - MicTv.in - Telugu News
mictv telugu

మా తండ్రి ఇంకా బతికే ఉన్నారు..ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ తనయుడు

August 13, 2020

my my father is still alive tweets Pranab Mukherjee's Son

భార‌త మాజీ రాష్ట్ర‌ప‌తి ప్రణబ్ ముఖర్జీ(84) కరోనా వైరస్ బారిన పడిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. బ్రెయిన్ సర్జరీ కోసం ఆయన సోమవారం ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్‌లో చేరారు. అక్కడ డాక్టర్ల సూచన మేరకు ఆయనకు కరోనా పరీక్షలు చేశారు. అందులో కరోనా పాజిటివ్ తేలింది. తరువాత ఆయనకు బ్రెయిన్ సర్జరీ చేసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 

బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టడంతో ఈ శస్త్రచికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే ఆయన బుధవారం రాత్రి మరణించారని వార్తలు వచ్చాయి. దీంతో అందరు సోషల్ మీడియాలో సంతాపం తెలియజేయడం మొదలు పెట్టారు. పలువురు ప్రముఖులు కూడా ఆయనకు సంతాపం తెలిపారు. దీంతో ప్ర‌ణ‌బ్ ఆరోగ్య ప‌రిస్థితిపై ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. త్వరలో కోలుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన కోసం మీ ప్రార్థనలకు కొనసాగించండి పేర్కొన్నారు.