My saga, an Italian ship sunk at sea
mictv telugu

వైరల్ వీడియో.. చూస్తుండగానే సముద్రంలో మునిగిపోయిన ‘మై సాగా’

August 24, 2022

ఓ భారీ ఓడ చూస్తుండగానే సముద్రంలో మునిగిపోయింది. వందల కోట్ల విలువ చేసే ‘మై సాగా’ అనే ఇటలీ ఓడ దక్షిణ ఇటలీ సముద్ర తీరంలో శనివారం క్షణాల్లో మునిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందులో ఉన్న 9 మంది సిబ్బందిని సహాయక సిబ్బంది సురక్షితంగా రక్షించగా, ముందుగా ఓడ ముందు భాగం కొంత నీటిలోకి ఒరిగింది. తర్వాత క్షణాల్లోనే మొత్తం ఓడ గల్లంతయింది. తర్వాత టగ్ బోట్‌తో ఓడను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో సాధ్యం కాలేదు. 40 మీటర్లున్న ఈ ఓడను 2007లో ఇటలీలోనే తయారు చేశారు. గల్లిపోలి నుంచి మిలాజోకు వెళ్లే క్రమంలో కెటన్‌జారో మెరీనా తీరంలో ప్రమాదవశాత్తు ఓడ మునిగిపోయింది. ఈ దృశ్యాలను ఇటలీ కోస్ట్‌గార్డ్ సిబ్బంది వీడియో తీశారు. కాగా, ప్రమాదానికి గల కారణాలను వెలికితీసేందుకు అధికారులు విచారణకు ఆదేశించారు.