నా బలం నా అర్థాంగి… కోహ్లీ - MicTv.in - Telugu News
mictv telugu

నా బలం నా అర్థాంగి… కోహ్లీ

September 27, 2018

భార్యపై ఒక్కసారిగా పొగడ్తల వర్షం కురిపించాడు క్రికెటర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. తన దేవత, తన అంతరంగిక మనోహరి అని భార్యను పొగడ్తలతో నింగికి ఎత్తేశాడు. ‘విరుష్క’ జంటగా ఫేమస్ అయిన విరాట్, అనుష్కలు హాట్ కపుల్‌గా ముద్రపడ్డారు. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్‌రత్నను కోహ్లీ అందుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా మూడో భారత క్రికెటర్‌గా ఈ అవార్డును అందుకున్నాడు కోహ్లీ.My strength is my wife ... Kohliగతంలో సచిన్, ధోనీలు ఈ పురస్కారాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్క ఫొటోను షేర్ చేసి ఆనందంతో ఆమెకు కృతజ్ఞతలు చెప్పాడు. ‘నన్ను లోపలనుంచి పూర్తి మనిషిగా మార్చిన ఉన్నత వ్యక్తి. ఒడిదుడుకులలో నన్ను గైడ్ చేసి, ఎల్లప్పుడూ నాభుజం తట్టి నడిపించింది. అడ్డంకులు ఎదురైనప్పుడు నన్ను ప్రోత్సహించే వ్యక్తి. నిజమైన ప్రేమను నాకు పరిచయం చేసిన వ్యక్తి. నా బలం… బలహీనత.. నా అర్ధాంగి అనుష్క’ అని భార్య అనుష్కపై ఎనలేని ప్రేమను కురిపించాడు కోహ్లీ.