'My t-shirt tore' SRK's lookalike Ibrahim Qadri recalls his Experience
mictv telugu

షారుఖ్ ఖాన్ డూప్‌కి గట్టి షాకిచ్చిన ఫ్యాన్స్

May 6, 2022

'My t-shirt tore' SRK's lookalike Ibrahim Qadri recalls his Experience

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌ను పోలి ఉన్న ఓ వ్యక్తికి.. ఆ హీరో అభిమానులు గట్టి షాక్ ఇచ్చారు. అప్పటి వరకూ షారుఖ్‌ని , అతని మూవీ సీన్స్ కాపీ కొడుతూ జనాలకు ఓ కలరింగ్ ఇచ్చిన అతనికి అనుకోని అనుభవం ఎదురైంది. గుజరాత్ కు చెందిన ఇబ్రహీం ఖాద్రీ అనే వ్యక్తి అచ్చం షారుఖ్ ఖాన్ లా ఉండడంతో .. అతని సినిమాల్లోని సీన్స్ ను ఇన్‌స్టాలో రీక్రియేట్ చేసి అత్యధిక ఫాలోయిర్లను సంపాదించాడు.

అయితే ఇటీవల ఆ హీరో అభిమానుల నుంచి ఓ చేదు అనుభవం ఎదురైందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇటీవల కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ గుజరాత్ లయన్స్ ఐపీఎల్ మ్యాచ్ కోసమని స్టేడియంకి వెళితే అక్కడ షారుఖ్ అభిమానులు తన మీద పడిపోయారని, దాని వల్ల ఇబ్బందిపడ్డానని చెప్పారు. తన టీషర్ట్ గట్టిగా పట్టుకోవటంతో… అది చినిగిపోయిందని.. అప్పుడుగానీ, బాలీవుడ్ బాద్షా ప్రతీ రోజు ఎలాంటి ఒత్తిడి ఎదురుకొంటాడో తెలిసొచ్చిందని ఆ ఇంటర్వ్యూలో తెలిపాడు.