My wife went missing three months ago: BSP district president
mictv telugu

భార్యను వెతకడంలో పోలీసుల విఫలం.. పిల్లలతో సూసైడ్ చేసుకుంటా : బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు

June 25, 2022

మూడు నెలల క్రితం కనిపించకుండా పోయిన తన భార్య జాడ తెలుసుకోవడంలో పోలీసులు విఫలమైనందున తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని వికారాబాద్ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు దొరిశెట్టి సత్యమూర్తి వెల్లడించారు. తాండూరుకి చెందిన ఆయన ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసిన సన్నిహితులు, బంధువులు ఆయన ఇంటికి వెళ్లి చూడగా, తాళం వేసి ఉంది. ఇద్దరు పిల్లలతో సెల్ఫీ వీడియో తీసిన సత్యమూర్తి ‘నా భార్య మూడు నెలల క్రితం కనిపించకుండా పోయింది. అప్పట్నుంచీ పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయింది. ఈ వ్యవహారం వెనుక పెద్దల హస్తం ఉంది. 48 గంటల్లో నా భార్య ఆచూకీ తెలుపకపోతే మా శవాల లొకేషన్ షేర్ చేస్తా’నని అందులో తన ఆవేదనను వ్యక్తపరిచారు. దాంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు అటు తప్పిపోయిన అన్నపూర్ణతో పాటు సత్యమూర్తి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.