నా భార్య నన్ను వదిలేస్తానంది: షాహిద్ కపూర్ - MicTv.in - Telugu News
mictv telugu

నా భార్య నన్ను వదిలేస్తానంది: షాహిద్ కపూర్

April 6, 2022

wif

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భార్య తనను వదిలేస్తానని బెదిరించిందని చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. సినీ ప్రియులకు నటుడు షాహిద్ కపూర్ తెలియని వారుండరు. తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డిని ‘కబీర్ సింగ్’గా హిందీలో రీమేక్ చేశారు. దీంతో సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటినుంచి షాహిద్ కపూర్ కథల ఎంపికల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా నటించిన చిత్రం ‘జెర్సీ’. తెలుగు ‘జర్సీ’కి హిందీలో రీమేక్‌కు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆయన ఓ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్‌తో సరదాగా ముచ్చటించారు. ‘జెర్సీ’ చిత్రానికి తాను వ్యక్తిగతంగా కనెక్ట్ అయ్యానని, కొన్ని సన్నివేశాలు షూట్ చేస్తున్నప్పుడు భావోద్వేగానికి లోనయ్యానని అన్నారు.

అంతేకాకుండా తన సతీమణి మీరా గురించి మాట్లాడుతూ..”మీరా సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాదు. పరిశ్రమ తనకు కొత్త. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. మాకు పెళ్లిన సమయంలోనే నేను నటించిన ‘ఉడ్తా పంజాబ్ విడుదలకు సిద్ధమైంది. విడుదలకు ముందు నటీనటుల కోసం ఎడిటింగ్ రూమ్‌లో స్పెషల్ షో వేశారు. నాతోపాటు మీరానీ అక్కడికి తీసుకు వెళ్లాను. సినిమా ప్రారంభమైన తర్వాత కాసేపు మీరా నాతో మామూలుగానే ఉంది.

కానీ, విరామ షాట్ పడగానే నేను తన ముఖం వైపు చూసి నవ్వాను. తను వెంటనే నా పక్క నుంచి లేచి వెళ్లిపోయి దూరంగా నిల్చుంది. తను ఎందుకలా ప్రవర్తిస్తుందో నాకు అర్ధం కాలేదు. “మీరా ఏమైంది? ఎందుకు నా నుంచి దూరంగా వెళ్లిపోయి అక్కడెక్కడో నిల్చున్నావు?” అని ప్రశ్నించాను. దానికి తను.. “నువ్వు ఇలాంటి వాడివా? నీలాంటి అలవాట్లు ఉన్నాయా? నీతో నేనింకా కలిసి ఉండలేను. నేను వెళ్లిపోతా” అని చెప్పింది. ఆ మాటలకు నేను షాకయ్యా. అదంతా సినిమా మాత్రమేనని తనకు అర్థమయ్యేలా చెప్పాను. నా మాటలతో తను కాస్త నెమ్మదించింది. ఆ సంఘటన నేను ఎప్పటికీ మర్చిపోలేను” అని షాహిద్ చెప్పుకొచ్చారు.