Mysterious "Blue Goo" Creature In The Atlantic Ocean Baffles Scientists
mictv telugu

సముద్రంలో మరో వింత జీవి.. తలలు పట్టుకుంటున్న సైంటిస్టులు

September 13, 2022

విచిత్రమైన ఎన్నో జీవరాశులకు సముద్రం నెలవు. ఎన్నో వింతలు, విశేషాలను సముద్రం చాలాసార్లు పరిచయం చేసింది. మత్స్యకారులకు అప్పుడప్పుడూ కొన్ని తారసపడడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో విచిత్రమైన జంతువును చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆ జీవిని చూసి సముద్ర శాస్తవేత్తలు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆ జీవి చూసేందుకు జీవిలా కాకుండా నీటి కుంటలా ఉంటుంది. ఈ జీవి అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఉంది.

చూడ్డానికి బ్లూ కలర్‌లో స్పాంజిలా ఉన్న ఆ వింత జీవిని నేషనల్‌ ఓషియానిక్‌ అండ్ అట్మాస్సియరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎన్‌ఓఏఏ) ఓషన్ ఎక్స్‌ప్లోరర్ సిబ్బంది కనుగొన్నది. అట్లాంటిక్‌లో చేసిన యాత్రలో వారికిది కనిపించింది. ఇది మృదువైన పగడపు స్పాంజ్‌ లేదా ట్యూనికేట్‌ కావచ్చు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ విచిత్ర జీవికి సంబంధించిన వీడియోని ఎన్‌ఓఏఏ ఓషన్ ఎక్స్‌ప్లోరర్ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. అంతేకాదు ఈ జీవిన ‘బ్లూ గూ’జీవిగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.