mysterious-fire-in-a-house-in-uttarakhand
mictv telugu

చంద్రగ్రహణం తర్వాత ఆ ఇంట్లో ఏం జరుగుతోంది..

November 18, 2022

mysterious-fire-in-a-house-in-uttarakhand

ఆ ఇంట్లో చంద్రగ్రహణం తర్వాత ఏం జరుగుతోంది.? ప్రతీ రోజు ఎందుకు మంటలు చెలరేగుతున్నాయి? దీని వెనుకు ఉన్న మిస్టరీ ఏంటీ ? భూకంపం ప్రభావమా లేక ఇంకేమైనా శక్తులు ఉన్నాయా.. ?

ఓ ఇంట్లో జరుగుతున్న అంతుబట్టని విషయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. నవంబర్ 8న చంద్రగ్రహణం.. మర్నాడు నవంబర్ 9న నేపాల్‌లో భూకంపం తర్వాత ఆక్కడ జరుగుతున్న విషయాలు అంతుచిక్కడం లేదు. రోజు మంటలు చెలరేగడం..ఇంట్లో ఏదో ఒకటి దగ్థం కావడం వారిని భయాందోళనకు గురిచేస్తోంది. ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ జిల్లా హల్ద్వానీలో జరుగుతున్న ఈ ఘటన మిస్టరీగా మారింది.

ఈ నెల 8న చంద్రగ్రహణం, భూకంపం సంభవించిన తర్వాతి నుంచి ఇంట్లో ప్రతి రోజూ రాత్రి మంటలు అంటుకుంటున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ఇలా జరుగుతుందేమోనని విద్యుత్ కనెక్షన్ తీయించారు. ఆ తర్వాతి కూడా ఇంట్లోని ఎలక్ట్రిక్ బోర్డులు, వైర్లు కాలిపోతుండడంతో వారి భయం మరింత పెరిగింది. బీరువాలోని దుస్తులు, మంచం, ఇతర వస్తువులు మంటలకు దగ్థం అవుతున్నాయి. 8 రోజుల్లో మొత్తం 20 సార్లు ఇంట్లో మంటలు చెలరేగాయి. వారికి ఏం జరుగుతుందో తెలియక తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరికి ఇళ్లను ఖాలీ చేసి వేరే నివాసానికి వెళ్లిపోయారు. ఆ ఇంట్లో చివరిసారిగా ఈ మంగళవారం రోజున మంటలు చెలరేగాయి.

సమాచారం తెలుసుకున్న అధికారులు ఈ విషయంపై పరిశీలన చేస్తున్నారు. దీని వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందనే అనుమానంతో దర్యాప్తు చేస్తున్నారు. భూకంపం సంభవించిన తర్వాత లీకై మంటలు వస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. శాస్త్రీయంగా పరిశీలించి విషయం వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు.