mysterious sinkhole in Chile
mictv telugu

ప్రపంచాన్ని భయపెట్టిన గొయ్యి

January 4, 2023

mysterious sinkhole in Chile

అనగానగా ఓ భారీ గొయ్యి….ఎంత అంటే ఊళ్ళకు ఊళ్ళనే మింగేసేంత. ఎందుకు ఏర్పడిందో, ఎలా ఏర్పడిందో తెలియక భయపెట్టిన గుంత. అంతకంతకు పెరుగుతూ ప్రపంచాన్ని వణికించింది. చిలీ దేశంలో ఏర్పడిన ఈ గొయ్యి చుట్టూ చాలా వార్తలు, అంతకు మించి కథలూ కూడా వచ్చాయి. ఏదో వినాశనం తప్పదంటూ ప్రచారమూ ఊపందుకుంది. ఈ ఊదరగొట్టుడు హెడ్‌లైన్స్‌ వెనుక అతిశయోక్తి మాత్రమే ఉందని చెబుతూ.. అసలు విషయాన్ని వెల్లడించారు అధికారులు.

చిలీ రాజధాని శాంటియాగోకు 800 కిలోమీటర్ల దూరంలోని, అటకామా రీజియన్‌లో టియెర్రా అమరిల్లా దగ్గర ఈ నెల మొదట్లో ఈ భారీ గుంత ఏర్పడి.. క్రమక్రమంగా పెరుగుకుంటూ పోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. వెడల్పు అంతకు అంతకు పెరుగుతూ.. సుమారు 200 మీటర్ల లోతైన ఈ గుంత.. మన శాట్చ్యూ ఆఫ్‌ యూనిటీ విగ్రహాన్ని మింగేసేంత సామర్థ్యం ఉంటుందన్న మాట.

అయితే.. ప్రాథమిక దర్యాప్తులో ఈ భారీ గొయ్యి ఎలా ఏర్పడిందన్న దానిపై ఎలాంటి అంచనాకు రాలేకపోయారు అక్కడి అధికారులు.. ఇప్పుడు ఆ మిస్టరీని దాదాపుగా చేధించారు. మానవ కార్యకలాపాల వల్లే ఆ భారీ గొయ్యి ఏర్పడిందని నిర్ధారణకు వచ్చేశారు. ఆ ప్రాంతంలో భారీ మైనింగ్‌ కార్యకలాపాల వల్ల ఆ గుంత ఏర్పడి ఉంటుందని అంచనాకి వచ్చి.. దానిని పూడ్చేసే ప్రయత్నాల గురించి ఆలోచిస్తున్నారు. Tierra Amarilla.. ప్రపంచంలోనే ఎక్కువగా కాపర్‌ను ఉత్పత్తి చేసే హబ్‌. కెనడాకు చెందిన ఓ కంపెనీ కార్యకలాపాల వల్లే ఈ భారీ గొయ్యి ఏర్పడి ఉంటుందని ఒక అంచనాకి వచ్చారు అక్కడి అధికారులు.

ఈ విషయంపై మైనింగ్‌ మినిస్టర్‌ మార్సెలా హెర్నాండో స్పందిస్తూ.. మితిమీరిన మైనింగ్‌ కార్యకలాపాల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.మరోవైపు ఈ భారీ గొయ్యి ఏర్పడిన సమీప ప్రాంతం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.