mystery stonehenge monuments
mictv telugu

అంతుచిక్కని అద్భుత రహస్యం-స్టోన్ హెంజ్

December 28, 2022

 mystery stonehenge monuments

ఇప్పుడైతే టెక్నాలజీ అభివృద్ధి చెందింది కాబట్టి సరిపోయింది. ఎంత బరువునైనా, ఎంత పెద్ద వస్తువునైనా ఒక చోటు నుంచి మరోచోటుకి తేలికగా రవాణా చేయొచ్చు. అంతేకాదు అలా రాళ్ళను ఎత్తే వాహనాలను, యంత్రాలను కూడా రవాణా చేసేయొచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికైనా. ఈ రోజుల్లో ఇట్లాంటి ఫీట్లు సర్వసాధారణం అయిపోయాయి.

కానీ 5 వేల సంవత్సరాల క్రితం నాటి సంగతి మరి. నాగరికత, సైన్స్‌ అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో దాదాపుగా 23 అడుగుల ఎత్తైన రాళ్ళను ఎలా రవాణా చేసుంటారో? ఒకదానిపై మరొకటి ఎలా పేర్చేవారో కదా.ఊహించడానికి కూడా అవ్వడం లేదు కదా. కానీ అలాంటి విచిత్రాలు జరిగాయి. ఏ డైనోసార్ల లాంటి పెద్ద పెద్ద జంతువులనో ఊపయోగించి ఉంటారు…లేదా ఏనుగులు లాంటి మామోత్ లను ఉపయోగించి ఉంటారా? ఏమో కానీ అద్భుతాలను మాత్రం చేయగలిగారు అప్పటి మనుషులు కూడా. ఎంతైనా మనుషులు కదా….ఏ కాలంలో అయినా తెలివైన వారే. కదండీ.ఇంతకీ ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా….ఇది చదివేయండి, మీకే అర్ధం అవుతుంది.

ఇంగ‍్లాండ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన స్టోన్‌హెంజ్‌ను చూస్తే అటువంటి సందేహమే కలుగుతుంది! వీటిని బృహత్‌ శిలాయుగానికి చెందిన సమాధి స్థలాలని కూడా అంటారు. అరుదైన బ్లూస్టోన్‌ మెటీరియల్‌తో రూపొందించిన అతిపెద్ద మెగాలితిక్‌ రాళ్ళ వృత్తాకర సమూహమే ఈ స్టోన్‌హెంజ్‌. ఐతే ఈ భారీ శిలలు అంత ఎత్తు ఏవిధంగా పెరిగాయో? వీటి నిర్మాణ సమయంలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఈ రాళ్ళను ఎలా తీసుకురాగలిగారో? ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. లేదా కొండలు పగిలి రాళ్ళు అలా ఒకదాని మీద ఒకటి నిలిచిపోయాయా. ఏమో కానీ దేనికీ ఆధారాలు అయితే లేవు. ఒకవేళ కొండలు పగిలి రాళ్ళు అలా ఒకదాని మీద ఒకటి నిలిచినా….అలా ఒక షేప్ లో, ఒకేరకంగా ఎలా నిలిచాయో.ఏదైనా ఇదొక అద్భుతమైన కట్టడం. ఈ అద్భుతమైన కట్టడాన్ని వీక్షించడానికి ప్రతీ యేట ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాకంగా టూరిస్టులు వస్తుంటారు.చూసిన వాళ్ళు మనలాగే ఆశ్చర్యపోతూనే ఉన్నారు కూడా.