తల్లి కోరిక తీర్చిన కొడుకు..ఆనంద్ మహీంద్ర నుంచి కారు గిఫ్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

తల్లి కోరిక తీర్చిన కొడుకు..ఆనంద్ మహీంద్ర నుంచి కారు గిఫ్ట్

October 23, 2019

తల్లి కోరిక తీర్చడం కోసం ఓ కొడుకు పడ్డ కష్టానికి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహింద్రను ఎంతగానో ఆకర్షితుడయ్యాడు. దీంతో వెంటనే ఆ కొడుక్కి కారును గిఫ్టుగా ప్రకటించాడు. కర్ణాటకలోని మైసూరుకు చెందిన చూద రత్న అనే వృద్ధురాలికి దేశంలోని అన్ని తీర్థయాత్రలు తిరగాలని కోరిక. కానీ, ఆమెకు భర్త లేడు. చిన్న ఉద్యోగం చేసుకుంటున్న కొడుకు డి.కృష్ణకుమార్ (39) మాత్రమే ఉన్నాడు. అతడి దగ్గర తనను తీర్థయాత్రలకు తీసుకెళ్లేంత డబ్బు లేదు. దీంతో తన కోరికను ఎవ్వరికి చెప్పలేక పోయింది. కానీ, చివరకు తన కొడుకుతో హంపి చూడాలని ఉందని చెప్పింది. దీంతో తల్లి కోరికను నెరవేర్చాలన్న కృష్ణ కుమార్ నిర్ణయించుకున్నాడు. తన వద్ద ఉన్న పాత స్కూటర్‌పై ఆమెను తీర్థయాత్రలకు తీసుకెళ్లడం మొదలు పెట్టాడు. ఇలా ఇప్పటివరకు తల్లీ, కొడుకులు తీర్థయాత్రల కోసం 48,100 కిలో మీటర్లు తిరిగారు. తల్లీ కొడుకుల తీర్థయాత్ర గురించి నాందీ ఫౌండేషన్ ఛైర్మన్ మనోజ్ కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

ఈ తల్లి కొడుకుల కథ మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు చేరింది. తల్లి కోసం కృష్ణ కుమార్ పడుతున్న కష్టానికి ఆయన ఫిదా అయ్యారు. వీరి గురించి ఆనంద్ మహీంద్రా..ఇదో అద్భుతమైన జీవితగాథ. కృష్ణకుమార్‌కు తల్లి పైనే కాకుండా దేశంపై కూడా చాలా ప్రేమ ఉంది. కృష్ణ కుమార్‌‌ను కలిసేలా మనోజ్ కుమార్ నాకు సాయం చేస్తే, కృష్ణకుమార్‌కు మహీంద్రా కేయూవీ 100 ఎన్ఎక్స్ టీ కారును బహుమతిగా ఇస్తాను. దీంతో తన తల్లిని ఆయన కారులో కూర్చోబెట్టి తదుపరి యాత్రను చేపట్టవచ్చు’ అని ట్వీట్ చేశారు.