బాలకృష్ణ తాజాగా నటించిన ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ చిత్రం వీర సింహారెడ్డి. ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌ని శుక్రవారం ఒంగోలులోని త్రోవగుంట సమీపంలోని అర్జున్ ఇన్ఫ్రాలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులిచ్చింది. దీంతో పాటు ఈ ఈవెంట్లోనే ట్రైలర్ రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సరిగ్గా రాత్రి 8.17 నిమిషాలకు థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేస్తామని మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడిస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. శ్రుతీహాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంపై మంచి హైప్ ఉంది. కన్నడ నటుడు దునియా విజయ్ ప్రతినాయక పాత్రలో కనిపిస్తున్నాడు. కాగా, దర్శకుడు గోపీచంద్ మలినేని స్వస్థలం ప్రకాశం జిల్లా కావడంతో ఈవెంట్‌ని అదే జిల్లాలో ప్లాన్ చేశారని టాక్.