తమసోమా జ్యోతిర్గమయా.. ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన శంకర్ - MicTv.in - Telugu News
mictv telugu

తమసోమా జ్యోతిర్గమయా.. ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన శంకర్

October 22, 2020

N Shankar releases Tamasoma Jyotirgamaya First Look poster

షార్ట్ ఫిలింస్, వెబ్‌సిరీస్‌లు తీస్తున్న యువ దర్శకులు సినిమాలు కూడా రూపొందిస్తున్నారు. మైక్ టీవీలో ‘అమ్మ ఒడి’ అనే షార్ట్ ఫిలిం తీసిన యువ షార్ట్ ఫిలింమేకర్ విజయ్ కుమార్ బడుగు దర్శకుడిగా ఓ సినిమాకు దర్శకత్వం వహించాడు. ‘తమసోమా జ్యోతిర్గమయా’ పేరుతో రూపొందించిన ఈ చిత్రంలో మైక్ టీవీలోనే వచ్చిన ‘షుక్రియా’ అనే షార్ట్ ఫిలింలో నటించిన ఆనంద్ హీరోగా నటించాడు. మరోపక్క మైక్ టీవీ షార్ట్ ఫిలింస్‌లో నటించిన రోహిణి ఆరెట్టి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఇటీవలే చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు    ఎన్ శంకర్ విడుదల చేశారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని.. అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు శంకర్. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని చిత్ర దర్శకుడు విజయ్ తెలిపారు. 

చేనేత, చేతివృత్తుల వాస్తవ జీవితాలు, వారి అంతరంగంలో ఉన్న కష్టాన్ని, కన్నీళ్ళని, చిన్న చిన్న ఆనందాలని ఒక సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం అని విజయ్ అన్నారు. ఈ సినిమా ద్వారా ఎంతోమంది ప్రతిభని ఈ సమాజానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ చిత్రాన్ని అందరూ ఆదరించి చేనేతలకు, చేతి వృత్తులకు అండగా నిలుస్తారని ఆశిస్తున్నామని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి మార్క్ కె ప్రశాంత్ సంగీతం అందించగా, శ్రవణ్ జీ కుమార్ కెమెరా, ఎడిటింగ్ అందించారు. విజయ్ కుమార్ బడుగు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తడాకా రమేశ్ నిర్మాత కాగా, ఆర్ట్ సైని భరత్.