‘నా పేరు మీనాక్షి’ సీరియల్ నటికి కరోనా.. - MicTv.in - Telugu News
mictv telugu

‘నా పేరు మీనాక్షి’ సీరియల్ నటికి కరోనా..

July 1, 2020

Naa peru meenakshi.

లాక్‌డౌన్ తర్వాత టాలీవుడ్ సినిమాలతోపాటు మొదలైన బుల్లితెర సీరియళ్ల షూటింగులకు ఆదిలోనే హంసపాదులు ఎదురవుతున్నాయి. పలువురు నటీనటులు కరోనా బారిని పడుతున్నారు. ‘సూర్యకాంతం’, ‘గృహలక్ష్మి’ సీరియళ్లలో నటించిన వారికి కరోనా సోకకగా కొందరిని క్వారంటైన్‌కు పంపారు. ఆయా పాత్రల లేకుండా కథలు అల్లుకుంటూ మిగతావారితో షూట్ చేస్తున్నారు. తాజాగా మరో తెలుగు సీరియల్ నటికి కూడా కరోనా సోకింది. 

‘నా పేరు మీనాక్షి’ సీరియల్‌లో నటించే యువతి ఇటీవల అనారోగ్యానికి గురైందని, పరీక్ష చేయించుకోగా పాజిటివ్ ఫలిత వచ్చింది. మిగతా వారికి వైరస్ సోకకుండా ఆమెను హోమ్ క్వారంటైన్‌లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. సీరియల్లో నటిస్తున్న మిగతా వారికి కూడా పరీక్షలు చేయిస్తున్నారు. మధ్యలో షూటింగ్ ఆపడం కష్టం కాబట్టి, సదరు యువతి పాత్ర లేకుండా ఎపిసోడ్స్‌ కథలు మారుస్తున్నట్టు టీవీ వర్గాలు చెబుతున్నాయి.