సైరాట్ టీం నుంచి మరో సంచలనం.. నాల్  టీజర్. - MicTv.in - Telugu News
mictv telugu

సైరాట్ టీం నుంచి మరో సంచలనం.. నాల్  టీజర్.

October 11, 2018

రెండేళ్ళ క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా ‘సైరాట్’. మరాఠీలో వచ్చిన ఈ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పఖ్ఖర్లేదు. దర్శకుడు నాగరాజు పొపట్రావ్ మంజూలేకు ఈ సినిమా అంతులేని విజయాన్ని ఇచ్చింది. కాగా ఇంతపెద్ద హిట్ సినిమా చేసిన ఈ టీమ్ నుంచి మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొని వుంది. ఆ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పెడుతూ వారినుంచి వస్తున్న మరో సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్‌లుక్ ఇవాళ విడుదల చేశారు. ‘నాల్’ పేరుతో విడుదలైన ఈ టీజర్‌పై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

మరి ఈ సినిమాకు దర్శకుడు నాగరాజు మాత్రం కాదు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్నారు. ఇన్ని రోజులు దర్శకుడిగా ఆణిముత్యాల్లాంటి సినిమాలు అందించిన నాగరాజు నటుడిగా, నిర్మాతగా కొత్త అవతారం ఎత్తారు. దర్శకుడు ఎవరంటే.. సైరాట్ సినిమాకు సినీమటోగ్రఫీ అందించిన సుధాకర్ రెడ్డి ఎక్కంటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  ఓ 8ఏళ్ళ బాలుడి భావోద్వేగాలతో నిర్మితమైన ఈ సినిమా నవంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సైరాట్ తర్వాత వస్తున్న ఈ ‘నాల్’ సినిమాపై దేశవ్యాప్తంగా చాలా అంచనాలు వున్నాయి. ఈ సినిమాకు సంబంధించి మరొక విశేషం ఏంటంటే దర్శకుడు సుధాకర్ రెడ్డి ఎక్కంటి తెలుగువాడు అవడం. ఈ మరాఠీ సినిమాకు తెలుగువాడు దర్శకుడు అవడం గర్వకారణం. ఈయన ప్రస్తుతం తెలుగులో వస్తున్న హిస్టారికల్ సినిమా ‘జార్జిరెడ్డి’కి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ‘చిన్న సినిమా పెద్ద విజయం’ అనే మాటకు నిదర్శనంగా మారారు సైరాట్ టీమ్. వారి నుంచి వస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. నవంబర్‌లో వస్తున్న ఈ సినిమా కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.