ఆత్మహత్య చేసుకుంటా.. టాలీవుడ్ హీరో బెదిరింపు - MicTv.in - Telugu News
mictv telugu

ఆత్మహత్య చేసుకుంటా.. టాలీవుడ్ హీరో బెదిరింపు

December 10, 2019

Naani Gadu01

టాలీవుడ్‌లో ఓ చిన్నబడ్జెట్  సినిమాకు ఊహించని షాక్ తగిలింది. చిత్ర యూనిట్‌కు తెలియకుండానే ‘నానిగాడు’ సినిమాను యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ విషయం తెలిసిన సినిమా హీరో దుర్గా ప్రసాద్ ఫిలిం ఛాంబర్ ఎదుటన నిరసనకు దిగాడు. కష్టపడి తీసిన సినిమాను ఎవరో యూట్యూబ్‌లో పెట్టారని తమను ఆదుకోవాలంటూ డిమాండ్ చేశాడు. 

ఈ సినిమాకు ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయిందని, దానికి యూ సర్టిఫికెట్ కూడా వచ్చిందని దుర్గా ప్రసాద్ తెలిపాడు. రూ. 40 లక్షలు  ఖర్చు పెట్టి సినిమా తీసి విడుదలకు సిద్ధమైన సమయంలో ఇలా బయటకు రావడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై ఫిలిం ఛాంబర్ వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరాడు. లేకపోతే చిత్ర యూనిట్‌తో సహా తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదింరిచాడు.  ఈ వ్యహారంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని వెల్లడించాడు.