‘Naatu Naatu’ singer Rahul thrilled with award
mictv telugu

గల్లీభాయ్ నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు…

January 11, 2023

దేశ సినీ చరిత్రలో ఇప్పటివరకు ఏ చిత్రానికి దక్కని ఈ గౌరవం ఆర్ఆర్ఆర్ సినిమా సొంతం చేసుకుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేదికపై ‘RRR’ సినిమా సత్తా చాటింది. బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో ‘నాటు.. నాటు..’ అవార్డును అందుకుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు ప్రకటించగానే రాజమౌళి, ఎన్టీఆర్, తారక్ ఎగిరి గెంతేశారు. దీంతో దేశ వ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా చిత్ర బృందానికి అభినందనలు వెలువెత్తుతున్నాయి. కీరవాణి సంగీతం, చంద్రబోసం సాహిత్యం అందించిన .”నాటు నాటు” పాటను కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రాఫర్‎గా పనిచేశారు.

ఆర్ఆర్ఆర్ సినిమా “నాటు నాటు” పాటకు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంతో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంటి ముందు సందడి నెలకొంది. ఆయన నివాసానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. ఫ్యాన్స్ మధ్య రాహుల్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నాడు. ఇక తనకు నాటునాటు పాటను పాడేందుకు అవకాశం కల్పించిన కీరవాణి, రాజమౌళి,రమ కు ధన్యవాదాలు తెలిపారు. “నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది. ఆ రేంజ్‌లో పాటకు గుర్తింపు వస్తుందని అనుకోలేదు. నన్ను నేడు ఎప్పుడు గల్లీబాయ్ గా పోల్చుకుంటా. కానీ ఇప్పుడు గల్లీబాయ్ పేరు అంతర్జాతీయ స్టేజ్‎పై వినిపించింది.స్టేజ్‌పై కీరవాణి గారు పోల్చుకుంటా. గర్వంగా అనిపిస్తుంది.” అని రాహుల్ ఆనందం వ్యక్తం చేశాడు.