Nadendla Manohar criticized the YCP government in the matter of RBKs
mictv telugu

ఆర్బీకేల్లో రాష్ట్రంలోనే అతి పెద్ద కుంభకోణం.. నాదెండ్ల మనోహర్

November 2, 2022

Nadendla Manohar criticized the YCP government in the matter of RBKs

ఏపీలోని గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో రాష్ట్రంలోనే అతిపెద్ద కుంభకోణం జరుగుతోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. మొత్తం 10,700 కేంద్రాల్లో అవినీతి జరుగుతున్నట్టు విజిలెన్స్ నివేదిక చెప్తుందని వెల్లడించారు. బుధవారం ఆయన తెనాలిలో మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్బంగా వైసీపీ ప్రభుత్వాన్ని మనోహర్ విమర్శించారు. ఈ క్రాప్ కోసం రైతుల వద్ద వైసీపీ ప్రభుత్వం లంచాలు తీసుకుంటోందని ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయని, రైతులను కులాల వారీగా గుర్తిస్తున్నారని మండిపడ్డారు. గంజాయి నిర్మూలన చేస్తున్నందుకు గత డీజీపీని తొలగించారని, చిన్న వాళ్లను మాత్రమే గంజాయి కేసుల్లో అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నేతల వసూళ్లు భయంకరంగా పెరిగాయని తెలిపారు.