Nadendla Manohar has made sensational allegations that he is plotting against Pawan Kalyan
mictv telugu

పవన్‌ కల్యాణ్‌ హత్యకు కుట్ర.. నాదెండ్ల మనోహర్ సంచలన ఆరోపణలు

November 3, 2022

Nadendla Manohar has made sensational allegations that he is plotting against Pawan Kalyan

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హత్యకు కుట్ర పన్నుతున్నారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సంచలన ఆరోపణలు చేశారు. వారు పవన్ అభిమానులు కాదని బుధవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు వెంటాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘విశాఖ ఘటన తర్వాత పవన్ ఇల్లు, పార్టీ కార్యాలయం వద్ద అనుమానితులు తచ్చాడుతున్నారు.

ఆయన ఎక్కిడికి వెళ్లినా అనుసరిస్తున్నారు. మంగళవారం బైకులపై, బుధవారం కారులో వెంటాడారు. వీరి వ్యవహారంపై భద్రతా సిబ్బంది సందేహపడుతున్నారు. వాళ్లు పవన్ ఫ్యాన్స్ కాదని క్లారిటీగా చెప్తున్నారు’ అని పేర్కొన్నారు. అటు పవన్ ఇంటి ముందు గొడవ పడ్డ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 31న అర్ధరాత్రి 11.30 గంటలకు జూబ్లీహిల్స్ పరిధి శ్రీరాం నగర్‌కు చెందిన ఇద్దరు యువకుడు పవన్ ఇంటి ముందు కారు నిలిపి గొడవ పడ్డారు. బౌన్సర్లు వచ్చి కారు తీయాలని చెప్పగా, యువకులు బౌన్సర్లతో గొడవ పెట్టుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విజయ్ ఆదిత్య, సాయి కృష్ణ చౌదరి అనే యువకులను అరెస్ట్ చేశారు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.