ఆనంద్ మహీంద్రా సాయం కోరిన ప్రభాస్ దర్శకుడు - MicTv.in - Telugu News
mictv telugu

ఆనంద్ మహీంద్రా సాయం కోరిన ప్రభాస్ దర్శకుడు

March 4, 2022

06

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. భారత సినీ చరిత్రలో మొదటి ఇండియన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. అయినా కొన్ని సన్నివేశాల్లో ప్రస్తుత టెక్నాలజీని మించి అడ్వాన్స్‌డ్ వెర్షన్ అవసరమవడంతో ఆనంద్ మహీంద్రా సాయం కోరారు దర్శకుడు. ఈ మేరకు ట్వీట్టర్‌లో ‘ మహీంద్రా సార్.. నేను ప్రస్తుతం భారీ తారాగణంతో ఒక ఇండియన్ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్నాను. ఇలాంటి సినిమా ఇప్పటి వరకు రాలేదు. దాని కోసం ప్రేక్షకుడు కలలో కూడా ఊహించని వాహనాలను చూపించబోతున్నాను. అందుకోసం కొన్ని చోట్ల ఇంకా ఆధునిక టెక్నాలజీ వాడాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో మీ ఇంజినీర్ల నుంచి సహాయ సహకారాలు అందిస్తే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంద’ని విన్నవించారు. కాగా, ప్రభాస్ సూపర్ హీరో పాత్రలో నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్ కీ రోల్ పోషిస్తున్నారు. దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటిస్తోంది.