నాగబాబుకు కరోనా పాజిటివ్..  - MicTv.in - Telugu News
mictv telugu

నాగబాబుకు కరోనా పాజిటివ్.. 

September 16, 2020

nagababau

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే దర్శకుడు రాజమౌళితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం దంపతులు తదితరులు ఈ మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. రాజమౌళి కుటుంబం ఈ వైరస్ బారి నుంచి బయటపడి ప్లాస్మా దానం కూడా చేసింది. బాలసుబ్రమాణ్యం దంపతులు ప్రస్తుతం చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్ చేశారు. తొందరగా కరోనాను జయించి ప్లాస్మాను దానం చేస్తానని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. నాగబాబు గతకొన్ని రోజులుగా చురుగ్గా బుల్లితెర షూటింగ్ లలో పాల్గొంటున్నారు. దీంతో అక్కడి నుంచి ఆయనకు వైరస్ సోకి ఉండొచ్చు అనుమానిస్తున్నారు.