రెండు రోజులుగా బాలకృష్ణ పేరు మారుమోగిపోతోంది. అయితే ఈసారి మంచిగా కాదు…చెత్తగా. అక్కినేని, తొక్కినేని అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. బాలకృష్ణకు అంత నోటి దూల ఏంటంటూ అందరూ మండిపడుతున్నారు. ఈ లిస్ట్ లో ఒక్క అక్కినేని ఫ్యాన్స్ మాత్రమే ఉంటారనుకుంటే పొరపాటే….మొత్తం తెలుగు ప్రేక్షకులందరికీ ఈ వ్యాఖ్యలు నచ్చలేదు. ఎంతైనా నాగేశ్వర్రావు లెజెండ్ యాక్టర్ కదా, అలా అనడం తప్పు కదా అంటున్నారు.
— chaitanya akkineni (@chay_akkineni) January 24, 2023
ఇప్పడు తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యల మీద అక్కినేని వారసులు, ఆయన మనుమలు నాగచైతన్య, అఖిల్ కూడా స్పందించారు. నంతమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వర్రావు, ఎస్ వి రంగారావుగారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచడం మనల్ని మనం కించపరుచుకోవడమే అంటూ ట్వీట్ చేసారు. ఎలాంటి పరుషమైన మాటలు లేకుండానే హుందాగా స్పందించారు అక్కినేని మనువళ్ళు.
— Akhil Akkineni (@AkhilAkkineni8) January 24, 2023
వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగ్ టైమ్ లో నటుల మధ్య ఏ అంశాలకు చర్చకు వచ్చాయో చెబుతూ…అందరూ అద్భుతంగా నటించారు. నాకు మంచి టైమ్ పాస్. ఎప్పుడు కూర్చుని వేద శాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు, ఈ అక్కినేని, తొక్కినేని అన్ని మాట్లాడుకునే వాళ్ళం అని బాలకృష్ణ అన్నారు. కానీ ఈ మాటలు చాలా వివాదస్పదం అయ్యాయి. అందరికీ కోసం తెప్పిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి :
అక్కినేనిపై బాలయ్య వివాదాస్పద కామెంట్స్.. ఘోరంగా ట్రోల్ చేస్తున్న అభిమానులు
సినిమాలను నిషేధిస్తే మీ పరిస్థితి ఏంటి? – కరీనా కపూర్