అభిమానులని బాదటం, అమ్మాయిలని కడుపు చేయాలనటం, కులాలని తిట్టడం ఇప్పుడు తాజాగా అక్కినేని, తొక్కినేని అంటూ అవహేళన చేయటం.. ఇదంతా బాలయ్య ట్రాక్ రికార్డు. అయితే స్టేజీలపై నోరు జారటం, తప్పయింది అంటూ క్షమాపణ చెప్పటం బాలయ్యకి హ్యాబిట్ అయిపోయింది అంటూ విమర్శలు వస్తున్నాయి. ఇక అమ్మాయిలపై, కులాలపై కించపరిచే కామెంట్స్ చేసినా ఇండస్ట్రీ నుండి మాత్రం ఎలాంటి వ్యతిరేకత రాలేదు. కానీ మొదటిసారి అక్కినేని కుటుంబం నుండి అది కూడా కుర్ర హీరోల నుండి చివాట్లు తినాల్సిన దుస్థితి బాలయ్యకి ఈ సారి వచ్చేసిందా అంటూ సగటు సినీ అభిమాని భావిస్తున్న పరిస్థితి.
ఇలా మాట్లాడాలి, అలా వాగొద్దంటూ.. చిన్నవాళ్లకి పెద్దవాళ్లు సుద్దులు చెప్పాలి కానీ నందమూరి బాలయ్య లాంటి 60 ఏళ్లు దాటిన పెద్దాయినకు, పట్టుమని మూడు పదులు దాటిన నాగ్ చైతన్య సుద్దులు చెప్పాల్సి వస్తోంది. అక్కినేని లాంటి మహానటుడిని అలా తూలనాడడం ఏమిటి అని సోషల్ మీడియాలో క్లాస్ లు పీకుతున్నారు. ఎఎన్నార్..ఎన్టీఆర్..ఎస్వీఆర్ లను మనమే కించపర్చడం తగదు అంటూ చైతు దాదాపు బాలయ్యకి కౌంటర్ ఇచ్చినట్టే అంటూ అక్కినేని అభిమానులు ఫీల్ అవుతున్న పరిస్థితి. అయితే బాలయ్య ఇలాంటివి పట్టించుకునే రకం కాదు అని తెలిసినా… అక్కినేని ఫ్యాన్స్ మాత్రం వెంటనే క్షమాపణ చెప్పాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అయితే చాలావరకు ఇండస్ట్రీ వర్గాలు బాలయ్యకే సపోర్టుగా నిలుస్తున్నట్టు తెలుస్తుంది. ‘ఆయనకు మాట్లాడడం రాదు. ఏం మాట్లాడేస్తారో ఆయనకే తెలియదు. లైట్ తీసుకోండి’ అంటూ కామెంట్ చేస్తున్నారు.