naga chaitanya marriage rumors with venkatesh daughter
mictv telugu

క్యూట్ హగ్ వెనుక కారణం.. వెంకిమామ కూతురురితో చైతు దెగ్గరవుతున్నాడా ?

December 6, 2022

తనపై ఎన్ని వార్తలు వచ్చినా నాగ చైతన్య సోషల్ మీడియాకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. అప్పుడప్పుడు తన సినిమా అప్డేట్స్ తప్పిస్తే అస్సలు సోషల్ మీడియాలో కనిపించరు. అలాంటిది చైతు ఒక స్పెషల్ వీడియోతో బయటికొచ్చాడు. చైతు మేనమామ హీరో వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత విదేశాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆమె హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. మరో రెండు నెలలు ఇక్కడే ఉంటుంది. ఈ క్రమంలో ఒక వంటింటి వీడియోతో మరదలు అశ్రీతతో కలిసి బావ నాగ చైతన్య కూడా సందడి చేశారు. నాగ చైతన్యకు హోటల్ బిజినెస్ వ్యాపకం ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. చైతుకి ‘షోయు’ అనే ఫుడ్ బిజినెస్ లో పార్ట్నర్ గా ఉన్నాడు. తన బిజినెస్ కి సంబంధించిన పూర్తి వివరాలని వెంకటేష్ కుమార్తె ఆశ్రిత దగ్గుబాటి బయట పెట్టే ప్రయత్నం చేసింది. షోయు కిచెన్ లో తన బావ నాగ చైతన్యతో ఆశ్రిత సరదాగా ముచ్చటించింది.

ఈ వీడియోలో అశ్రిత ‘చై బావా’ అని ఆప్యాయంగా పిలవటం హైలైట్ అని చెప్పాలి. బావ అని ఎంత ప్రేమగా పిలిచింది? అని ప్రజలు అనుకుంటున్నారు. ఇక ఈ బావమరదళ్ళ జంట కూడా ఎంత చూడముచ్చటగా ఉంది. సో క్యూట్ అంటూ పెద్దోళ్ల నుండి యువత వరకు స్పందిస్తున్నారు. ఒకే ఫ్రేమ్ లో ఈ ఇద్దరినీ చూడడానికి రెండు కళ్ళు సరిపోవటంలేదని దగ్గుపాటి, అక్కినేని అభిమానులు స్పందిస్తున్నారు. వెంకీమామ కూతురు, నాగ చైతన్య జంటని చూసి మరి సమంత ఎలా ఫీల్ అవుతుందా అని కౌంటర్లు కూడా వేస్తున్నారు జనాలు. అయితే ఈ లోగా నాగ చైతన్య రెండో పెళ్లి గురించి కూడా పుకార్లు వచ్చాయి. వెంకీమామ తన చిన్న కూతురిని నాగ చైతన్యకు ఇచ్చి పెళ్లి చేయబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజమవుతే బావుండు అంటూ కూడా కొందరు కామెంట్స్ పెడుతున్నారు. దీంతో వంటింట్లో బావతో మరదలు జరిపిన ఈ సరదా సంభాషణ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.