ప్రేమించడం ఎలాగో తెలిసింది నీవల్లే.. నాగచైతన్య పోస్ట్ వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేమించడం ఎలాగో తెలిసింది నీవల్లే.. నాగచైతన్య పోస్ట్ వైరల్

July 7, 2022

విడాకుల తర్వాత నాగచైతన్య, సమంత లు.. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెడుతున్నా అవి వెంటనే వైరల్ అవుతున్నాయి. తాజాగా నాగచైతన్య తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. తన తల్లిదండ్రులతో పాటు సమంతతో కలిసి ఉన్నప్పుడు పెంచుకున్న కుక్కపిల్ల గురించి కూడా మెన్షన్ చేశాడు. తన తల్లితో ఒక ఫోటో, తన తండ్రితో ఒక ఫోటో షేర్ చేయడమే కాక సమంత పెంచుకునే పిట్ బుల్ డాగ్ హ్యాష్ తో కూడా ఒక ఫోటో షేర్ చేశాడు.

 

View this post on Instagram

 

A post shared by Chay Akkineni (@chayakkineni)

నాగచైతన్య నటించిన కొత్త సినిమా ‘థ్యాంక్యూ’ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా తన జీవితంలో కీలకపాత్ర పోషించిన వారికి ఆయన ‘థ్యాంక్యూ’ చెప్పారు. థాంక్యూ అనేది చాలా గొప్ప పదం అని చెప్పుకొచ్చిన నాగచైతన్య.. మనం కొన్నిసార్లు దీన్ని ఎక్కువగా వాడుతుంటాం కానీ దాన్ని కొందరికే చెబుతూ ఉంటామని అన్నారు. కొందరికి మనం ఎక్కువగా ఈ థ్యాంక్స్ చెప్పలేమని చెబుతూనే తాను తన జీవితంలో ముగ్గురికి థాంక్స్ చెప్పాలనుకుంటున్నానని చెబుతూ తన కన్నతల్లి, తండ్రితో పాటుగా సమంత పెంచుకునే పిట్ బుల్ డాగ్ హ్యాష్ ఫోటో కూడా షేర్ చేశాడు.

అమ్మ.. చిన్నప్పటి నుంచి నా వెన్నంటే ఉంటూ, ఎనలేని ప్రేమను పంచినందుకు థ్యాంక్యూ. నాన్న.. ప్రతి విషయంలో నాకంటూ ఓ దారి చూపించి, ఓ స్నేహితుడిలా ఉన్నందుకు కృతజ్ఞతలు. అలాగే, హాష్‌.. ప్రేమించడం ఎలాగో తెలిసింది నీవల్లే… నన్ను ఒక మనిషిగా ఉంచినందుకు థ్యాంక్యూ’’ అని చైతన్య పోస్ట్ పెట్టారు.

ఈ పోస్ట్ ను నా జీవితంలో చాలా ముఖ్యమైన వారికి అంకితం ఇస్తున్నానని చెప్పుకొచ్చిన నాగచైతన్య వారికి ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా సరిపోదని అందుకే మీరు కూడా మీ జీవితంలో ముఖ్యమైన వారి గురించి చెబుతూ ఫోటోలు షేర్ చేయమని కోరాడు. ద మ్యాజిక్ వర్డ్ ఈజ్ థాంక్యూ అనే ఒక హ్యాష్ టాగ్ ఇచ్చి మీరు థాంక్స్ చెప్పాలనుకున్న వారి ఫోటోలు షేర్ చేయమని అన్నాడు.