సమంత – చైతూల పెళ్లి ..3రోజులు ! - MicTv.in - Telugu News
mictv telugu

సమంత – చైతూల పెళ్లి ..3రోజులు !

July 7, 2017

సమంత – నాగచైతన్య  పూలుపండ్లు అయిపోయాయి గానీ లగ్గమే ఇంకా అవలేదని చాలా మంది అక్కినేని ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులేస్కొని ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఎదురు చూపులకింక తెర దించుతూ ఒక ఖుష్ కబర్ ను కొత్త సినిమా టీజర్ లా రిలీజ్ చేసారు అక్కినేని ఫ్యామిలీ. ఆ టీజర్ ఏంటంటే.. అక్టోబర్ 6 నుంచి 8 వరకు మూడు రోజులు వాళ్ళ పెళ్ళి అంగరంగ వైభవంగా జరగనుంది. ఐదు రోజుల పెళ్ళి అనగా విన్నాం కానీ ఈ మూడు రోజుల పెళ్ళేంటని ఆశ్చర్యపోకండి ఎక్కువరోజులైతే వచ్చే పోయేవారికి ఇబ్బందిగా వుండదూ ? అందుకే త్రీ డేస్ నో రిస్కన్నమాట !

ఈ కమనీయమైన మూడు రోజుల పెళ్ళి గోవాలో జరగనుంది. అదీ అసలు ట్విస్టన్నమాట. ఎలా వుంది టీజర్లో సడన్ సర్ ప్రైజ్ ? సూపర్ కదా.. ఈ మూడు రోజుల వాళ్ళ పెళ్లి హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో కనువిందుగా జరగనుంది మరి. హైదరాబాదులో చేస్కోక ఆ గోవాలో పెళ్ళి చేస్కుంటే ఎలా ? వచ్చీపోయేవారికి ఎంత రిస్కు అని ఆలోచించక్ఖర్లా ? అంటే అది వాళ్ళిష్టం. ఎందుకంటే.. వాళ్ళిద్దరు కలిసి తొలుత జోడీ కట్టి నటించిన సినిమా ‘ ఏ మాయ చేసావే ’ అక్కడ్నించే కదా  వీరి మధ్య ఇష్క్ పుట్టింది. ఇప్పటికైనా విషయం మీకు పూర్తిగా అర్థమైందనుకుంటా.. ఓహ్ నో.. ఏ మాయ చేసావే సినిమా గోవాలో షూట్ జరిగిందట. అందుకే గోవాను స్పాట్ గా ఎంచుకొని బీచ్ సాక్షిగా ఒక్కటవుతున్నారన్నమాట.