Naga Chaitanya shares first pic with Samantha after divorce
mictv telugu

సమంత ఫోటోను షేర్ చేసిన నాగచైతన్య..విడిపోయాక ఇదే మొదటి సారి

February 26, 2023

నాగచైతన్య, సమంతల గురించి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. విడాకులు తీసుకుని దూరమయ్యారు. తర్వాత ఎవరి జీవితాన్ని వారు గడుపుతున్నారు. విడిపోయిన అనంతరం ఒకరి కోసం మాట్లాడుకునేది..పోస్ట్‎లు పెట్టేది పెద్దగా కనిపించలేదు. అయితే అభిమానుల పుణ్యమా అని సోషల్ మీడియాలో మాత్రం నాగచైతన్య, సమంతలు ఎదో ఒక రకంగా ట్రెండింగ్ అవుతూనే ఉన్నారు. తాజాగా నాగచైతన్య తన సోషల్ మీడియా అకౌంట్‌లో పెట్టిన పోస్ట్‎హాట్ టాపిక్‎గా మారింది. ఇందుకు కారణం సమంతతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేయడమే.

నాగచైతన్య, సమంత మొదటి సారి కలిసి నటించిన సినిమా ఏ మాయే చేశావే. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2010 ఫిబ్రవరి 26న విడుదలైంది. అంటే నేటికి 13 ఏళ్ళు పూర్తి చేసుకుంది. దీంతో నాగచైతన్య ఇన్‎స్టా‎గ్రామ్‎లో ఓ పోస్ట్ పెట్టాడు. సెలబ్రేటింగ్ 13 ఇయర్స్ అని క్యాప్షన్ ఇచ్చి ‘ఏ మాయే చేశావే ’ సినిమా పోస్టర్‌ను షేర్ చేశాడు. ఆ పోస్ట్‌లో సమంతో కలిసి ఉన్న ఫోటు ఉండడం విశేషం.ఈ ఫోటోను చై షేర్ చేయడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సమంత మాత్రం..

సమంతకు ఏమాయ చేశావే మొదటి సినిమా కావడంతో ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆమె కూడా పలు పోస్ట్‎లను షేర్ చేసింది. ఏ మాయ చేశావేకు 13 ఏళ్లు అంటూ నాగచైతన్య లేని ఫోటోలను మాత్రమే షేర్ చేసింది. అదే విధంగా త‌న ప‌ద‌మూడేళ్ల ప్ర‌యాణాన్నిగుర్తుచేసుకుంటూ ట్విట్టర్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. “అభిమానులు చూపించిన ఆద‌ర‌ణ వ‌ల్లే ప‌ద‌మూడేళ్ల ప్ర‌యాణాన్ని స‌క్సెస్‌ఫుల్‌గా పూర్తిచేసుకోగ‌లిగాను. వారి ప్రేమే త‌న‌ను ఎల్ల‌ప్పుడూ ముందుకు న‌డిపిస్తుంది.అభిమానుల ప్రోత్సాహం వ‌ల్లే ఈ స్థాయికి చేరుకున్నాను. ఇండస్ట్రీలోకి వచ్చి ప‌ద‌మూడేళ్లు పూర్త‌యినా ఇప్పుడే కొత్త‌గా జ‌ర్నీని మొద‌లుపెట్టిన అనుభూతి క‌లుగుతోంది” అని సామ్ రాసుకొచ్చింది.