వెబ్ సిరీస్‌లో నటించనున్న నాగ చైతన్య
తెలుగు చిత్రసీమ పరిశ్రమలో యువ హీరోలు నటిస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఎంతంగా ఆకట్టుకుంటున్నావో.. ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి, యువ హీరోలలో మంచి పేరును సంపాదించుకున్న హీరో నాగచైతన్య. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన 'లవ్ స్టోరీ' చిత్రం ఎంతంటి విజయాన్ని చూరగొందో అందరికి తెలిసిందే. అయితే, ఈ మధ్య సామాజిక మాధ్యమాలలో నాగచైతన్య వెబ్ సిరీస్‌లో నటించబోతున్నాడు అనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలన్నీ వాస్తవమేనని మంగళవారం రుజువైంది.
నాగచైతన్య ప్రస్తుతం 'థ్యాంక్యూ, బంగార్రాజు' సినిమాల్లో నటిస్తూనే, వెబ్ సిరీస్‌లో కూడా మొదటిసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించనున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో చైతూ సరసన ప్రియా భవానీ శంకర్ నటించనుంది. ఈ వెబ్ సిరీస్‌కు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించనున్నారు. అయితే, ఈ వెబ్ సిరీస్‌కు ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. ఈ నెల చివరి వారంలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సిరీస్‌లో 24 నుంచి 30 ఎపిసోడ్స్ ఉండనున్నట్లు సమాచారం. హారర్ కథలో సాగే సన్నివేశాలలో నాగచైతన్య నటించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.