nagababu-about-varun-tej-marriage
mictv telugu

మెగా కాంపౌండ్‌లో మోగనున్న పెళ్ళి బాజా

February 1, 2023

 nagababu-about-varun-tej-marriage

మెగా హీరో వరుణ్ తేజ్ వివాహం మీద నాగబాబు క్లారిటీ ఇచ్చారు. త్వరలో వరుణ్ సింగిల్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టనున్నాడని అనౌన్స్ చేశారు. దీంతో మెగా కాంసౌండ్ లో పెళ్ళి బాజాలు మోగనున్నాయి అంటూ ఫ్యాన్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య పాల్గొన్న ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ పెళ్ళెప్పుడని నాగబాబుని అడగ్గా….తర్వలోనే ఉంటుందని చెప్పారు.

అయితే వరుణ్ పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి ఎవరనేది మాత్రం నాగబాబు చెప్పలేదు. ఆ విషయం తాను చెప్పనని, వరుణే స్వయంగా చెప్పుకుంటాడని అన్నారు. పిల్లలను కంట్రోల్ చేయాలని తాను ఎప్పటికీ అనుకోను అని, ఎవరి జీవితాలు వాళ్ళే చూసుకోవాలనేది తన సిద్ధాంతమని చెప్పారు. అందుకే తాను, మిసెస్ ఒకచోట, వరుణ్ ఒకచోట ఉంటున్నామని తెలిపారు. పెళ్ళి తర్వాత కూడా వరుణ్ వేరేగానే ఉంటాడని స్పస్టం చేశారు. విడివిడిగా ఉన్నప్పటికీ మేమంతా ఒక్కటేనని తెలిపారు. మెగా వర్సెస్ అల్లు అనే ప్రచారం మీద కూడా నాగబాబు స్పందించారు. అవన్నీ వదంతులే అని, ఎప్పటికీ తామంతా ఒక్కటేనని స్పష్టంచేశారు.