గాంధీ బతికుంటే ఇదే చెప్పేవారు.. నాగబాబు మరో సంచలనం - MicTv.in - Telugu News
mictv telugu

గాంధీ బతికుంటే ఇదే చెప్పేవారు.. నాగబాబు మరో సంచలనం

May 23, 2020

cfghfhfgh

గాడ్సే నిజమైన దేశభక్తుడని వివాదస్పద వ్యాఖ్యలు చేసిన జనసేన నేత నాగబాబు మరోసారి సంచలనం సృష్టించారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా మరో పోస్ట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. 

కరెన్సీ నోట్లపై సుభాష్ చంద్ర బోస్, అంబేద్కర్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, లాల్ బహదూర్ , పీవీ నరసింహారావు, అబ్దుల్ కలాం, సావర్కార్, వాజ్‌పేయి లాంటి మహానుభావుల చిత్రాలను చూడాలని ఉందని పేర్కొన్నారు. దీంతో మరోసారి సోషల్ మీడియా వేధికగా ఆయన వ్యాఖ్యలపై భిన్న వాదనలు వినబడుతున్నాయి. 

తన డిమాండ్‌ను గాంధీ బతికి ఉంటే సమర్థించే వారని చెప్పారు. ఆయన ఉంటే తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశ భక్తుల ఫొటోలను నోట్లపై ముద్రించాలని కోరే వారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మన దేశం కోసం పని చేసిన వారి పేర్లు తప్ప, వారి మొహాలు కనిపించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇకనైనా వారి ఫొటోలను కరెన్సీపై చూడాలని ఉందని చెప్పారు. ప్రజలు కూడా ఇలాంటి మహనీయులను మర్చిపోకూడదనే తన ఆశగా పేర్కొన్నారు. కాగా గాంధీని టార్గెట్ చేసుకొని నాగబాబు చేస్తున్న వ్యాఖ్యలు గత కొన్ని రోజులుగా సంచలనంగా మారుతున్నాయి.