నోరు జారకండి..బాలకృష్ణకు నాగబాబు వార్నింగ్! - MicTv.in - Telugu News
mictv telugu

నోరు జారకండి..బాలకృష్ణకు నాగబాబు వార్నింగ్!

May 28, 2020

mnfdhrth

ఇటీవల తెలంగాణ ప్రభుత్వంతో సినీ పరిశ్రమ పెద్దలు జరిపిన చర్చలకు తనను పిలవలేదని నాటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీ పెద్దలు మంత్రి తలసానితో కలిసి భూములు పంచుకుంటున్నారా? అంటూ బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీనిపై నాగబాబు కౌంటర్ ఇచ్చారు. బాలకృష్ణ వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయి. ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సినీ పరిశ్రమకు చెందిన వారినే కాకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని సైతం కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో చిరంజీవి ఇంట్లో సినీ పెద్దలు భేటీ అయ్యారని నాగబాబు తెలిపారు. షూటింగ్ లను ఎలా పునరుద్ధరించాలనే దానిపై చర్చించారని తెలిపారు. మీటింగ్ కు తనను పిలవలేదని బాలకృష్ణ చెప్పడంలో తప్పులేదన్నారు. కానీ, సినీ పెద్దలు మంత్రితో కలిసి భూములు పంచుకుంటున్నారని ఆరోపించడం దారుణమని చెప్పారు. ఇది కేవలం సినిమా ఇండస్ట్రీని మాత్రమే అవమానపరచినట్టు కాదని తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కించపరచినట్టని నాగబాబు వెల్లడించారు. ఈ మేరకు నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్ లో వీడియోను పోస్ట్ చేశారు.