తన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను మాటిమాటికీ ప్యాకేజీ ప్యాకేజీ అని విమర్శిస్తున్నవారిపై నటుడు నాగబాబు నిప్పులు చెరిగారు. పవన్ కు ఉన్న దమ్ము వారికి లేదని, అందరికీ బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందని హెచ్చరించారు. ‘‘ఓడిపోతే జైలు ఊచలు లెక్కబెట్టే పరిస్థితి లేదిక్కడ…’’ అని స్పష్టం చేశారు. పవన్‌పై, ఆయన పార్టీపై మీడియాలో వస్తున్న వ్యతిరేక వార్తలపై ఆయన మండిపడ్డారు. ఆయా అంశాలను వివరిస్తూ సోషల్ మీడియలో ప్రకటన జారీచేశారు. అయితే ఎవర్ని ఉద్దేశించి దీన్ని జారీ చేశారో స్పష్టంగా తెలియడం లేదు. ప్రకటనలో ఏముందంటే..
‘‘న్యూస్ చానెల్స్ నిష్పక్షపాతంగా ప్రజలకి న్యూస్ అందించాలి.కానీ ఆలా కోరుకోవటం ఈ రోజుల్లో అత్యాశ అవుతుందేమో. పోనీ ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాయటం అనేది వాళ్ళ ఇష్టం.అది వాళ్ళ విజ్ఞత. కొంతమంది నీచ రాజకీయ నాయకులు ఏదో తప్పుడు మాటలు మాట్లాడారంటే అది వాళ్ళ నీచమైన మనస్తత్వం.కానీ, కనీసం journalistic values కూడా లేకుండా తప్పుడు వార్తలు వండి వడ్డించే న్యూస్ చానెల్స్‌ని కానీ ఈ పత్రికల్ని కానీ ఏ పేరు తో పిలవాలి. మీరు గుడ్డ కాల్చి మొహం మీద వేస్తే ఉక్కిరిబిక్కిరి అవుతారేమో అవినీతి రాజకీయనాయకులు, కానీ ఇక్కడున్నది పవన్ కళ్యాణ్, నిప్పురా, జాగ్రత్తగా రాతలు రాయండి.మీరు కూర్చున్న చెట్టు కొమ్మల్ని మీరే నరుక్కుంటే కింద పడి చచ్చేది మీరే, జాగ్రత్త. పవన్ కళ్యాణ్ మరో 25 ఇయర్స్ ప్రజలకోసం యుద్ధం చెయ్యగలడు. మీకు అంత
ఓపిక లేదు. ఓడిపోతే జైలు ఊచలు లెక్కపెట్టే పరిస్థితి లేదిక్కడ. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చే నాయకులంటే మీకెంత లోకువ. ఇంకెన్నాళ్లు ప్యాకేజీ. ప్యాకేజీఅంటూ వాగి చస్తారు అదేమాట మిగిలిన రెండు పార్టీ ల నాయకులని అనడానికి మీకు దమ్ములేదు.ప్రజా సేవ కోసం వచ్చిన వాళ్ళు మా ప్రెసిడెంట్, మా లాంటి కార్యకర్తలు ఇలాంటి మాటలని పడతాం..మా ప్రెసిడెంట్ ని కార్యకర్తలని వీరమహిళలని నీచంగా మాట్లాడే మీ అందరికి బుద్ధి చెప్పే రోజు ఇంకెంత దూరంలోనే లేదు.
మీరు వాగిన ప్రతి అడ్డమైన వాగుళ్ళకి రాతలకి సంజాయిషీ ఇచ్చుకునే రోజు దగ్గరలోనే వుంది.ఇంతకన్నా దిగి మాట్లాడ్డం నాకు చేత కాదు..
ఇట్లు,
కొణిదెల నాగబాబు’’