గాడ్సే నిజమైన దేశభక్తుడు, పాపం ఆ రోజుల్లో..: నాగబాబు  - MicTv.in - Telugu News
mictv telugu

గాడ్సే నిజమైన దేశభక్తుడు, పాపం ఆ రోజుల్లో..: నాగబాబు 

May 19, 2020

Nagababu Tweet on Nathuram Godse.jp

నాథూరాం గాడ్సేపై జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన నిజమైన దేశభక్తుడు అంటూ ట్విట్టర్‌లో అభిప్రాయపడ్డారు. ఆయన పుట్టిన రోజు సందర్భాన్ని గుర్తు చేసుకొని ఫొటో షేర్ చేస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు రాసుకొచ్చారు. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు నాగబాబు ట్వీట్ అనుకూలంగా, మరి కొందరు వ్యతికంగా కామెంట్లు పెడుతున్నారు. 

గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు. కానీ, నాథూరాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం నాథూరాం గాడ్సే. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్’ అంటూ పేర్కొన్నారు. అప్పట్లో ఆయన వైపు వాదనలను మీడియా చూపించలేకపోయిందని కూడా అభిప్రాయపడ్డారు. ఆ రోజుల్లో మీడియా అధికార పార్టీకి లోబడి పని చేసిందని ( ఈ రోజుల్లో కూడా చాలా వరకు అంతే ) అని చెప్పుకొచ్చారు. కాగా బీజేపీతో కొంత కాలంగా జనసేన పార్టీ కలిసి పని చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారింది.