కూతురి విడాకులపై క్లారిటీ ఇచ్చిన నాగబాబు - MicTv.in - Telugu News
mictv telugu

కూతురి విడాకులపై క్లారిటీ ఇచ్చిన నాగబాబు

March 23, 2022

naga

ఈ మధ్యే వివాహమైన మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక త్వరలో విడాకులు తీసుకోబోతోందని వార్తలు రావడం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా నాగబాబు క్లారిటీ ఇచ్చారు. మా ఎన్నికల తర్వాత సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న నాగబాబు.. చాలా కాలం తర్వాత మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ నెటిజన్ నిహారిక విడాకుల అంశాన్ని ప్రస్తావించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘నేనే కోడింగ్ నేర్చుకొని నీహారిక ఇన్‌స్టాగ్రాం అక్కౌంటుని డియాక్టివేట్ చేశా. మళ్లీ డీకోడింగ్ నేర్చుకున్న తర్వాత యాక్టివేట్ చేస్తా’నంటూ బదులిచ్చారు. కాగా, నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేది. పెళ్లి, పెళ్లి తర్వాత టూర్ల గురించి విషయాలు రెగ్యులర్గా పోస్ట్ చేసేది. ఈ క్రమంలో నిహారిక పెట్టిన ఓ పోస్ట్ వల్ల అత్తారింట్లో గొడవలయ్యాయని, దాంతో నిహారిక ఇన్‌స్టాగ్రాం అకౌంట్ క్లోజ్ చేసేశారని పుకార్లు వచ్చాయి. మరొకవైపు భర్తతో వైవాహిక జీవితంలో సమస్యలంటూ కొందరు, త్వరలో విడాకులు తీసుకోబోతోందని కొందరు కామెంట్లు చేశారు. ఈ విషయంపై గతంలో నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ స్పందిస్తూ అలాంటిదేమీ లేదనీ, తామిద్దరం కలిసే ఉన్నామంటూ ప్రకటించారు. అయినా పుకార్లు ఆగకపోవడంతో నాగబాబు ఇచ్చిన ఫన్నీ సమాధానంతో అభిమానులకు, సినీ జనాలకు ఓ స్పష్టత వచ్చినట్టయింది.