సవ్యాసాచిగా రానున్న చైతూ... - MicTv.in - Telugu News
mictv telugu

సవ్యాసాచిగా రానున్న చైతూ…

August 16, 2017

 

నాగచైతన్య అక్టోబర్ 6న పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం నాగచైతన్య యుద్దం శరణం లో నటిస్తున్నారు. అయితే ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కు సంతకం చేశాడు. చందూ మెుండేటి తెరకెక్కిస్తున్న సవ్యాసాచి మూవీలో నటించనున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ చిత్రబృందం ఈ రోజు విడుదల చేసింది.

ఇందులో నాగచైతన్య వెనుకకు తిరిగి ఆయుదాలు చేతిలో పట్టుకొని నిలబడి ఉన్నాడు.దానితో ఈ సినిమా యాక్షన్ మూవీగా ఉంటుంది అనుకుంటున్నారు.చందూ మెుండేటి డైరెక్షన్ లో వచ్చిన ప్రేమమ్ లో నటించిన నాగచైతన్య కు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభం అవుతుందని నాగచైతన్య ట్విట్టర్ ద్వారా తెలిపారు.