నాగచైతన్యకు మెట్రోలో కిస్ ఇచ్చిన సాయిపల్లవి... - MicTv.in - Telugu News
mictv telugu

నాగచైతన్యకు మెట్రోలో కిస్ ఇచ్చిన సాయిపల్లవి…

February 14, 2020

dfbc nh

దర్శకుడు శేఖర్ కమ్ముల తాజాగా నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా ‘లవ్ స్టోరి’ పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమాలోని ‘ఏయ్ పిల్లా’ అనే సాంగ్ ప్రివ్యూను చిత్ర బృందం విడుదల చేసింది.

ఒక నిమిషం నిడివి ఉన్న ఈ ‘ఏయ్ పిల్లా’ వీడియో సాంగ్‌లో నాగచైతన్య, సాయి పల్లవిల మధ్య ఉన్న కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. ఓ సీన్‌లో మెట్రో ట్రైన్‌లో చైతన్యకు సాయి పల్లవి కిస్ ఇస్తుంది. అప్పుడు నాగచైతన్య కంటతడి పెడతాడు. దానికి సాయి పల్లవి ముద్దు పెడితే ఏడ్చేస్తారా అని అడగడం ఎంతో క్యూట్‌గా ఉంది. రెహమాన్ శిష్యుడు పవన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. కాగా, గతంలో ఈ సినిమాకు సంబందించి నాగ చైతన్య పై ఓ వీడియో విడుదలవ్వగా అందులో చైతన్య ఓ ఫిట్నెస్ సెంటర్‌లో పనిచేస్తూ ఆర్డినరీ బాయ్‌లా కనిపించాడు.