తోక ఇడిసిపెట్టు - అప్పడు ముందల పడ్తవు ! - MicTv.in - Telugu News
mictv telugu

తోక ఇడిసిపెట్టు – అప్పడు ముందల పడ్తవు !

June 10, 2017

ఆర్టిఫిషియల్ నవ్వుతో పాపం తెలుగు ప్రేక్షకుల మదిని గెలుచుకునే ప్రయత్నం మళ్ళీ ఫెయిలైంది. రారండోయ్ అంటే..వేడుక చూడ్డానికి వచ్చినవాళ్ళు మళ్ళీ రాము అని చెప్తున్నారు. క్యాజువల్ గా నవ్వితేనే ఇరవై నాలుగు పళ్ళు కనిపిస్తాయి, విరగబడి నవ్వేస్తే ముప్ఫై రెండు పళ్ళూ ఎక్స్ పోజ్ చేసే మన ఏకైక అక్కినేని నట వారసుడు చైతూ వేడుక తుస్సుమంది ! పాపం నాగచైతన్యను స్టార్ హీరోగా నిలబెట్టాలని తండ్రి నాగార్జున విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఎందుకో నిలబడలేక చతికిల పడుతున్నాడు. ఇంతకీ కారణం ఏమంటారు ?

ఏముందీ.. ముందు నటన రావాలి అంటారు. అది లేకుండా ఎంత పే..ద్ద బ్యాగ్రౌండ్ వున్నా ఆ గ్రౌండ్ లో నిలబడటానికి సత్తా వుండాలి. అది లేకే నాగచైతన్య తండ్రి ఎంత ముందుకు తోస్తున్నా వెనక్కే వచ్చేస్తున్నాడు చైతు. తండ్రి తోక ఇడిసి పెడితేనైనా ముందల పడ్తుండొచ్చు. అఖిల్ కన్నా ముందు చైతూనే నిలబెట్టడానికి నాగార్జున వేస్తున్న జిమ్మిక్కులన్ని వర్సగా ఫెయిలే అవుతున్నా అదే అటాక్ !

గొప్ప కాంట్రవర్సీని మూఠగట్టుకొనొచ్చిన ‘ రారండోయ్ వేడుక చూద్దాం ’ సినిమా చూసిన జనాలు విపరీతంగా తిట్టేస్కుంటున్నారు. కానీ ఆ తిట్లు వాళ్ళకి ‘ సినిమా సూపర్ డూపర్ హిట్టన్నట్టే ’ వినబడుతున్నట్టున్నాయి. జబర్దస్త్ ప్రీమియర్ లీగ్ చూసినట్టుగా వుంది, పైగా వ్యక్తిత్వ వికాసం అనబడే పుస్తకం నుంచి వాక్యాలకు వాక్యాలను తస్కరించి సుదీర్థమైన డైలాగులుగా రాసారని, నాగ చైతన్య యాక్టింగ్ చూస్తుంటే ఏలియన్ ను చూసినట్టుందని, జబర్దస్త్ నుంచి స్ఫూర్తి పొంది దరిద్రపుగొట్టు పాటొకటి, దానికితోడు ఎప్పటెప్పటి అరిగి, విరిగి, వేసారిపోయిన సీడీ సినిమాల కథలను ఒక్కచోట చేర్చి చాలా తెలివిగా సిన్మా తీసారు. బట్ ఆడియన్స్ అంత వెర్రోళ్ళేం కాదుకదా ? ఆడవాళ్ళు ఆరోగ్యానికి హానికారమా అనేది పక్కాగా చూపించి గొప్ప ఘనకార్యం చేసామని దర్శక నిర్మాతలు జబ్బలు చరుచుకుంటున్నారు. ప్రేక్షకులను బకరాలను చేస్తున్న మన ఫక్తు కమర్షియల్ సినిమా రూపకర్తలు ఎప్పటికీ ఇలాంటి సినిమాలే తీస్తుండొచ్చు.