చైతూ అభిమానులకు పండుగ.... - MicTv.in - Telugu News
mictv telugu

చైతూ అభిమానులకు పండుగ….

July 27, 2017

నాగచైతన్య ప్రస్తుతం తమిళ దర్శకుడు కృష్ణ ఆర్వి మరిముత్తు డైరెక్షన్ లో యుద్దం శరణం అనే మూవీలో నటిస్తున్నాడు. సినిమా టైటిల్ తోనే మూవీ పై భారీ అంచనాలు పెంచారు. ఇందులో హీరో శ్రీకాంత్ విలన్ గాకనిపించనుండడంతో అభిమానులలో ఈ సినిమా పై ఆసక్తి పెరుగుతుంది. అయితే నిన్న సాయంత్రం మూవీ యూనిట్ మూవీ గురించి ఫ్యాన్స్ కి ఒక సర్ ఫ్రైజ్ విషయాన్ని చెబుతామని చెప్పారు.జూలై 31న చిత్ర టీజర్ ను విడుదల చేస్తున్నామంటూ తన ట్విట్టర్ ద్వారా చైతు తెలిపాడు. చిత్రం హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది.

ఈ చిత్రన్ని వారాహి చలన చిత్రం నిర్మిస్తుంది. ఈ మూవీలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా రావు రమేష్, రేవతి లు ముఖ్య పాత్రలు పోషించారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.