కుక్కమాంసానికి గుడ్‌బై చెప్పిన నాగాలాండ్ - MicTv.in - Telugu News
mictv telugu

కుక్కమాంసానికి గుడ్‌బై చెప్పిన నాగాలాండ్

July 5, 2020

Nagaland

కుక్కలను తినొద్దు మొర్రో అని జంతు ప్రేమికులు ఎన్నో ధర్నాలు, నిరసనలూ చేశారు. అయినా నాగాలాండ్ ప్రభుత్వం పట్టించుకునే పాపాన పోలేదు. కరోనా కారణంగా ఇప్పుడు మాత్రం దారికి వచ్చింది. ఇకపై కుక్కమాంసం అస్సలు తినమని చెబుతోంది. నాగాలాండ్‌కి కుక్క మాంసం దిగుమతి, వ్యాపారం, అమ్మకం ఇకపై ఉండదని తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో దేశంలోని కుక్కలు బతికిపోయినట్టే అని జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే నాగాలాండ్‌లో ఓ వర్గం ప్రజలు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. కుక్కల్ని తినడం అనేది తరాలుగా సంప్రదాయంగా వస్తోందనీ.. తమ ఆచారాల్ని మంట కలిపే కుట్ర జరుగుతోందని వాదిస్తున్నారు వారు. నాగాలాండ్‌ ప్రభుత్వం అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న కారణం వేరే ఉంది. నాగాలాండ్‌లోని ఓ వెట్ మార్కెట్లో సంచుల్లో కుక్కల్ని తాళ్లతో కట్టి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చైనాలో ఇలాంటి వెట్ మార్కెట్ కారణంగానే కరోనా పుట్టిందని చాలా మంది కామెంట్లు చేశారు.  

నాగాలాండ్ ప్రభుత్వ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్రమంలో నాగాలాండ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో ప్రభుత్వం మెట్టు దిగక తప్పలేదు. నాగాలాండ్‌కి ఏటా 30,000 కుక్కల్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. వాటిని వెట్ మార్కెట్లలో చితకబాది ప్రాణం తీస్తున్నారు. తరవాత మేకల్ని కోసినట్టు కోసి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారు.  ఈ ఏడాది మొదట్లో మిజోరం ప్రభుత్వం.. కుక్కల అమ్మకాలపై నిషేధం విధించింది. చైనా ప్రభుత్వం కూడా కుక్క మాంసం తినమని చెప్పి, మళ్లీ కుక్కమాంసం తినే వారం రోజుల పండగ చేసుకుంటోంది. కాగా, నాగాలాండ్ కుక్క మాంసంపై నిషేధం మనకైనా ఎవరికైనా మంచిదే. ఎందుకంటే ఇప్పుడు ఒకరి ఆహారపు అలవాట్లే అడ్డమైన వైరస్ వ్యాప్తికి కారణం అవుతున్నాయి. అందుకు ఉదాహరణ చైనానే. గబ్బిలాలను తినడం వల్లే కరోనా వైరస్ వ్యాప్తి చెందిందనే విషయం తెలిసిందే.