క్వారంటైన్‌కు నాగాలాండ్ సీఎం - MicTv.in - Telugu News
mictv telugu

క్వారంటైన్‌కు నాగాలాండ్ సీఎం

July 31, 2020

Nagaland CM Home Quarantine

దేశంలో కరోనా ఎవరినీ విడిచి పెట్టడం లేదు. ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఏదో ఒక రూపంలో దాడి చేస్తూనే ఉంది. తాజాగా నాగాలాండ్‌లోనూ ఈ మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. ఏకంగా సీఎం కార్యాలయానికే దీని సెగ తగిలింది. సిబ్బంది కరోనా బారిన పడటంతో రాష్ట్ర ముఖ్యమంత్రి హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీఎం కార్యాలయ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంటి నుంచే ఆయన పరిపాలన అంశాలపై సమీక్షలు చేస్తారని వెల్లడించారు. 

సీఎం ఇంటిలో పని చేసే నలుగురు సిబ్బందికి పాజిటివ్ అని తేలింది. వెంటనే వారిని ఐసోలేషన్‌కు తరలించారు. దీంతో సీఎం నీఫియు రియో హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఇంటిని శానిటైజ్ చేశారు. 48 గంటల పాటు సీఎం కార్యాలయాన్నికూడా మూసివేశారు. సిబ్బందితో పాటు సీఎంతో సన్నిహితంగా ఉన్న అధికారులు కూడా హోం క్వారంటైన్‌లోకి వెళ్లాలని సూచించారు.  కాగా ఇప్పటి వరకు అక్కడ 1,566 కరోనా కేసులు మాత్రమే నమోదు అయ్యాయి.